ఈ పర్మిట్‌తో జీరో దందాకు చెక్

Fri,August 23, 2019 11:54 PM

-వ్యవసాయ మార్కెట్‌లో కాగిత రహితపు సేవలు
-ప్రతి కొనుగోలు ఆన్‌లైన్‌లో చూపాల్సిందే
-కొనుగోలుకు ఈ పర్మిట్ ఉంటేనే ఇతర ప్రాంతాల్లో విక్రయానికి అవకాశం
-జిల్లాలో 77 మంది ట్రేడర్స్ లైసెన్స్‌లు అప్‌లోడ్

గద్వాల,నమస్తే తెలంగాణ: రైతుల నుం చి కొనుగోలు చేసే ప్రతి ధాన్యం గింజను ఇక నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేసే విధానానికి ఈ నెల 19 నుంచి ప్రభుత్వం శ్రీ కారం చుట్టింది. ఇప్పటికే వ్యవసాయ మార్కెట్‌లలో ఈ-నామ్ ద్వారా రైతుల నుంచి సరుకుల కొనుగోలు చేపట్టి అక్ర మ దందాను అరికట్టి రైతులకు గిట్టు బా టు ధర వచ్చేలా చూసిన ప్రభుత్వం ఈ నెల 19న వ్యవసాయ మార్కెట్‌లలో ఈ పర్మిట్ విధానం ల్రపవేశ పెట్టి అక్రమాల కు అడ్డుకట్ట వేసింది. ఈ విధానం అమలు చేయడం వల్ల మార్కెట్‌లలో జీరో వ్యా పారం నిరోధించడంతో పాటు మార్కెట్ ఆదాయానికి వ్యాపారులు గండి కొట్టకుండా చర్యలు చేపట్టింది. ఈ విధానం ప్రభుత్వం అమలు చేయడంతో వ్యాపారులు గద్వాల వ్యవసాయ మార్కెట్‌లతో పాటు ఇతర మార్కెట్‌లలో కొనుగోలు చేసిన సరుకులు ఎక్కడైనా విక్రయించాలంటే తప్పని సరిగా కొనుగోలు దారుడు ఈ-ట్రేడ్ ఆన్‌లైన్‌లో అను మతి పొంది ఉంటేనే అవకాశం ఉంటుంది లేని పక్షం లో ఇతర ప్రాంతాల్లో అమ్ము కోవడానికి వీలు ఉండదు. వ్యవసాయ మార్కెట్ యార్డులలో రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసిన సరుకులను వివిధ ప్రాంతాలకు సరఫరా చేయా లంటే ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారా ఈ-ట్రాన్స్‌పోర్టు విధానంలో చేయాల్సి ఉంటుంది.

గతంలో మ్యాన్‌వల్‌గా..
గతంలో వ్యవసాయ మార్కెట్ నుంచి సరుకులు కొనుగోలుదారులు, కమిషన్ ఏజంట్లు వ్యవసాయశాఖ ముద్రించిన పుస్తకాలు తీసుకుని వారు అందులో రైతుల దగ్గర నుంచి సరుకులు కొనుగోలు చేసిన వివరాలు పొందు పరిచే వారు అయితే ఇందులో కొనుగోలు దారులు అక్రమాలకు పాల్పడే వారు. ఎలా అంటే కొనుగోలు దారులు రైతుల దగ్గర ఎక్కువ సరుకులు కొనుగోలు చేసి మ్యాన్‌వల్ రికార్డు పుస్తకంలో కొన్న సరుకులు తక్కువగా చూయించే వారు. దీంతో మార్కెట్ ఆదాయానికి భారీగా గండి పడేది. కొనుగోలు దారులు మార్కెట్ అధికారులకు చూయించిన సరుకు పోను వారి దగ్గర మిగిలిన సరుకు ఇతర ప్రాంతాలకు తీసు కెళ్లి విక్రయించి లాభాలు గడించే వారు. దీంతో జీరో దందా కొనసాగేది. అయితే ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్‌లో ప్రభు త్వం తీసుకొచ్చిన ఈ-పర్మిట్ విధానం వల్ల రైతుల నుంచి ఎవరైతే సరుకులు కొనుగోలు చేస్తారో వారు తప్పని సరిగా ఎంత సరుకు కొనుగోలు చేశారో ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఒక వేల కొనుగోలు దారులు ఆన్‌లైన్‌లో వారు కొన్న సరుకులు తక్కువగా నమో దు చేస్తే వారు కొన్న సరుకు ఇతర ప్రాం తాల్లో విక్రయించే సమయంలో ఆన్‌లైన్ కొనుగోలు దారులు నమోదు చేసిన వివరాలకు బయట విక్రయించే దానికి తేడా వస్తుండడంతో అక్కడ వారు చేసే అక్రమ వ్యాపారం గుర్తించడానికి అవకాశం ఉం టుంది. రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తప్పని సరిగా ఎదో ఒక రోజు విక్రయించాల్సి ఉంటుంది కా బట్టి వారు చేసే అక్రమాలు బయట పడే అవకాశం ఉంటుంది.

ఈ-పర్మిట్ విధానం వల్ల..
వ్యవసాయ మార్కెట్‌లో ఈ-పర్మిట్ విధా నం వల్ల సరుకుల రవాణా పారద ర్శకం గా కొనసాగుతుంది. ఏ వ్యాపారి దగ్గర ఏ సరుకు ఎంత నిల్వ ఉంది అనే విషయం ఎప్పటి కప్పుడు తెలిసిపోతుంది. దీంతో పాటు మార్కెట్ ఫీజ్ కూడా నిర్ణీత కా లంలో వసూలు అయ్యే పరిస్థితి ఉం టుంది. దీంతో సరుకుల రవాణాలో చెక్‌పోస్టులు, విజిలెన్స్ తదితర తనిఖీలలో కొనుగోలు దారులకు ఇబ్బందులు రాకుం డా ఉండే అవకాశం ఉంది. ఈ- ట్రాన్స్‌పోర్టు పర్మిట్ విధానంతో మార్కె టింగ్ శాఖ ఆదాయం పెరగడంతో పాటు పారదర్శకమైనా విధానం అమలవు తుంది.

జిల్లాలో 77మంది ట్రేడర్స్ లైసెన్స్‌లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్
జిల్లాలో గద్వాల, అలంపూర్ మార్కెట్‌లకు సంబంధించి 77 మంది ట్రేడర్స్ లైసెన్స్‌లు ఆన్‌లైన్ అప్‌లోడ్ చేశారు. జిల్లాలోని రెండు మార్కెట్‌లలో ఈ విధానం అమలు చేస్తున్నారు. ఈ ట్రాన్స్ పోర్టు పర్మిట్‌తో ప్రతి ట్రేడర్ తమ మొబైల్‌తో సులభంగా ఈ రశీదు పొంది సరుకు రవాణా చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. అయితే ఖరీదుదారుడు తాను కొనుగోలు చేసిన ధాన్యానికి సంబం ధించి ఈ-పర్మిట్ విధానం ద్వారానే సరుకులు ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. ఒక వేళ ఈ-పర్మిట్ పొందకుండా మార్కెట్ ఫీజ్ ఎగ్గొటే ప్రయత్నం చేసి జీరో కింద తరలించేందుకు ప్రయత్నిస్తే ఇది మార్కెట్ అధికారుల తనిఖీలో బయట పడితే ధాన్యం తరలించే వాహనాలను సీజ్ చేయడంతో పాటు పట్టు బడ్డ ధాన్యం ఖరీదు పై ఒక్క శాతం నుంచి మూడు శాతం రెట్టింపు నగదు వసూలు చేసే అవకాశం ఉంది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి రెండు సార్లు మాత్రమే మి నహాయింపు ఉంటుంది. అలాగే ట్రేడర్స్ చేస్తే జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి ట్రేడర్స్ లైసెన్సు రద్దు చేసే అవకాశం మార్కెట్ అధికారులకు ఉంది.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles