పశువుల కొట్టం దగ్ధం

Fri,August 23, 2019 11:51 PM

-కాలి బూడిదైన వ్యవసాయ పరికరాలు
వనపర్తి రూరల్ : నిప్పు రవ్వలు గాలికి ఎగసిపడి పశువుల కొట్టం దగ్ధమైంది. ఈ సంఘటన మండలంలోని దత్తాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. దత్తాయిపల్లి గ్రామానికి చెందిన రైతు నిరంజన్‌కు ఇంటి పక్కనే పశువుల కొట్టం ఉంది. రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం కూడా ఇంటి ముందు వంట చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో పశువుల కొట్టంపై పడటంతో గాలికి వెంటనే మంటలం టుకున్నాయి. ఇది గమనించిన నిరంజన్, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. ఫలితంగా కోట్టంలోని పలు వ్యవసాయ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. కొట్టంలో ఉన్న బైక్ పాక్షికంగా దెబ్బతిన్నదన్నారు. దాదాపు రూ.20 వేల ఆస్తి నష్టం జరిగిందని, ఎవరికీ ప్రాణం నష్టం జరగలేదని తెలిపారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles