అచ్చంపేట పట్టణంలో చోరీ

Fri,August 23, 2019 11:51 PM

అచ్చంపేట రూరల్ : పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు. ఎస్సై పరశురాం కథనం ప్రకారం... పట్టణంలో వెంకటేశ్వర కాలనీకి చెందిన దాసర్ల పద్మ గురువారం కల్వకుర్తి పట్టణానికి వెళ్లిందన్నారు. తిరిగి శుక్రవారం ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయన్నారు. ఇంట్లోకి వెళ్లి చూడగా 2 తులాల బంగారం, రూ.30 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. అనంతరం క్లూస్ టీం, డాగ్ స్వాడ్‌తో పరిశీలించిన ఎస్సై పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై విలేకరులకు తెలిపారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles