ఆరోగ్యానికి క్రీడలే పునాది

Fri,August 23, 2019 11:50 PM

అయిజ: మనిషి మానసిక శారీరక ఆరోగ్యానికి క్రీడలే పునాది అని చిన్నప్పటి నుంచె క్రీడలకు అలవాటు పడితే దేహానికి మంచిదని గద్వాల ఆర్డీవో రాములు విద్యార్థులకు సూచించారు. పాఠశాల క్రీడా సమైక్య ఆధ్వర్యంలో మండలంలో ని ఉత్తనూర్ గ్రామ జిల్లా పరిషత్ ఆవరణలో జరుగుతున్న 65 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి ఖోఖో, అథ్లెటిక్, రన్నింగ్, జంపింగ్ పోటీలకు ఆర్డీవో రా ములు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ అనునిత్యం ఆటలు ఆడటం వలన మనిషి ఆరోగ్యంగా ఎదుగుతాడని చెప్పా రు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే ఆటలకు ఒక అలవాటుగా చేసుకోవాలని సూచించారు. అయిజ ఎంపీపీ తిరుమల్‌రెడ్డి సహాకారంతో పాఠశాల అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పారు. క్రీడల్లో గెలుపు ఓటములు క్రీడాకారులు సమానంగా స్వీకరించాలన్నారు. ప్రతి అపజయం వెనుక విజయం దాగి ఉం టుందని ఓడినామని నిరుత్సా పడకుండా విద్యార్థులు గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంద్రరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పాఠశాల దశనుంచే విద్యతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు.

ఇక్కడ ఎంపికైన విద్యార్థులు జోనల్, రాష్ట్రస్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుక రావాలని సూచించారు. జిల్లా స్థాయిలో జరుగుతున్న ఈ క్రీడల నిర్వాహణకు తోడ్పాటు అందిస్తున్న ఎంపీపీ స హకారం మరువ లేనిదని చెప్పారు. ఉత్తనూర్ పాఠశాల రాష్ట్రంలో ఎక్కడ లేని వి ధంగా కార్పోరేట్ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దుతున్న వైనం అభినందనీయమన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని వెలికితీసే విధంగా ప్రతి సంవత్సరం ని ర్వహిస్తున్న మండల స్థాయి క్రీడా పోటీల కు ఉత్తనూర్ వేదికగా ఘనంగా నిర్వహించడం అది తిరుమల్‌రెడ్డికే సాధ్యమన్నా రు. అనంతరం ఆర్డీవో రాములు, డీఈవో సుశీంద్రరావు ఎంపీపీ తిరుమల్‌రెడ్డితో కలిసి జ్వోతి ప్రజ్వలన కార్యక్రమం చేపట్టి క్రీడా పోటీలు ప్రారంభించారు. జిల్లాలోని 12 మండలాల నుంచి 100మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిడు తిమ్మారెడ్డి, తాసిల్దార్ కిషన్‌సింగ్, ఎంపీడీవో సాయిప్రకాశ్, జెడ్పీటీసీ పుష్పా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles