గురుకులాలు విజ్ఞాన భాండాగారాలు

Fri,August 23, 2019 11:50 PM

వనపర్తి రూరల్ : తెలంగాణ ప్రభుత్వ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి అందిస్తున్న సంక్షేమాల వల్ల త్వరలోనే వాటి ఫలితాలు విద్యార్థుల రూపంలో అందనున్నాయని ఎంపీపీ కిచ్చారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని చిట్యా ల గ్రామ శివారులోనిమ హాత్మాజ్యోతిబా పూలే గురకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండు రోజుల విజ్ఞాన మేళ ముగింపు కార్యక్రమానికి ఎంపీపీ కిచ్చారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గురుకుల పాఠశాలలంటేనే ఒక క్రమశిక్షణతో కూడిన విద్యార్థులు ఉంటారన్న విషయం ఇక్కడ చూస్తే తెలుస్తున్నదన్నారు. విద్యతో పాటు అన్ని రకాల క్రీడ, విజ్ఞాన సదస్సుల వసతులను విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. అందకుముందు గ్రామ సర్పంచు భాను ప్రకాష్, జిల్లా సైన్స్ అధికారి శ్రీనువాసులు మాట్లాడుతూ సైన్స్ పై విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠశాల ఉపాధ్యాయులు వివరించి ప్రయోగత్మాకంగా చేసి చూయించాలని సూచించారు. అనంతరం విజ్ఞాన మేళ ప్రదర్శనలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో బహుమతులు సాధించిన విద్యార్థులకు ఎంపీపీ, తదితరుల చేతుల మీదుగా అందజేశారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles