శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

Fri,August 23, 2019 11:49 PM

-చెంచు ముత్తైదువులకు ప్రాధాన్యం
శ్రీశైలం, నమస్తే తెలంగాణ : శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల మహా క్షేత్రమైన శ్రీశైలంలో శ్రావణమాసం సందర్భంగా నాలుగో శుక్రవారం ఉదయం అలంకార మండపంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిపించారు. నల్లమల అటవీ ప్రాంతంలో నివాసముంటున్న చెంచు ముత్తైదు వులకు ప్రాధాన్యత ఇస్తూ దేవస్థానం వారు శాస్ర్తోక్తంగా వ్రతాన్ని నిర్వహించారు. అమ్మవారిని ఇంటి ఆడపిల్లగా.. స్వామివారిని అల్లుడుగా భావిస్తూ చెంచులు అనాదిగా చేస్తున్న సేవలను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కోదండరామిరెడ్డి, శ్రీశైలప్రభ సంపాదకులు డాక్టర్ అనిల్‌కుమార్ వివరించారు.

అనంతరం ప్రధాన అర్చకులు పీఠం మల్లయ్య, స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు మహా సంకల్పాన్ని పఠించారు. పురాణాల్లో తెలిపినట్లుగా పరమేశ్వరుడు పార్వతీదేవికి స్వయంగా వరలక్ష్మి వ్రత ప్రాశస్త్యాన్ని వివరించినట్లు తెలిపారు. ఈ వ్రతం చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని అర్చక స్వాములు వివరించారు. సుమారు 500 మంది చెంచు ముత్తైదువులు, 250 మంది స్థానిక ముత్తైదు వులు వ్రతపూజలో పాల్గొన్నారు. వీరికి ఉచితంగా స్వామి అమ్మవార్ల గర్భాలయ దర్శనాలు కల్పించా మని ఏఈవో కృష్ణారెడ్డి తెలిపారు. వివిధ ప్రాంతాల చెంచుగూడెంల నుంచి మహిళలను ఆహ్వానించి ఏర్పాట్లను పర్యవేక్షించిన ఐటీడీఏ అధికారి ఎంకేవీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఏపీడీ భాస్కర్‌రావు ముత్తైదువులను ఎంపిక చేసినందుకు అధికారలు అభినందించారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles