మానవ మనుగడకు చెట్లే ఆధారం

Fri,August 23, 2019 11:49 PM

ఇటిక్యాల: మానవ మనుగడకు చెట్లే ఆధారమని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని వళ్లూర్( ఎమ్మెల్యే సొంత గ్రామం)లో శుక్రవారం హరితహారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ రహదారికి ఇరువైపులా, పాఠశాల ఆవరణ లో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అనంతరం గ్రా మంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడు తూ మనం బతకాలంటే చెట్లే ఆధారమన్నారు. చె ట్లు సమృద్ధిగా లేనందువల్లే ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. గ్రామాల పరిధిలో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత పూర్తిగా సర్పంచులదేనన్నారు. గ్రామం నుంచి జాతీయ ర హదారి వరకు గల బీటీరోడ్డు, అలాగే శాంతినగర్ వరకు వెళ్లే బీటీ రోడ్డుకు ఇరువైపులా విరివిగా మొక్కలు నాటాలని గ్రా మస్తులకు సూచించా రు. నాణ్యమైన విద్య తో పాటుగా స్వేచ్ఛగా చ దువుకొనే వెసులుబా టు ఒక్క ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటుందన్నారు. ఒత్తిడితో విద్యనందించే ప్రైవేట్ విద్య కు పిల్లలను పంపరాదన్నారు. తన సొంత గ్రామమైన వళ్లూర్‌ను అభివృద్ధి చేసే బాధ్యత పూర్తిగా తనదేనన్నారు.

గ్రామం లో ఒక రాజకీయ పార్టీ వారు ప్రజలను అయోమయంలోకి నెట్టేవిధంగా ప్రవర్తిస్తున్నారని, వారి కల్లిబొల్లి మాటలు ప్రజలు నమ్మకూడదన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సం క్షేమ పథకాలను అందరికి అందేలా కృషిచేస్తానన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తు లు శ్మశానవాటికకు భూస్థల వివాదం, కా ంపౌండ్‌వాల్ నిర్మాణం, గ్రామంలో అం తర్గత సీసీ రోడ్ల నిర్మాణం, అంగన్‌వా డీ భవనాల నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే కు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నా రు. కార్యక్రమంలో సర్పంచ్ ఏసన్న, జె డ్పీటీసీ హన్మంత్‌రెడ్డి, సర్పంచులు జయచంద్రారెడ్డి, రవీందర్‌రెడ్డి, వీరన్న, మండలపార్టీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, తాసిల్దార్ రమేశ్‌రెడ్డి, ఎంపీడీవో రామమహేశ్వర్‌రెడి, విద్యాధికారి రాజు, ఉ పసర్పంచ్ గిడ్డారెడ్డి, నాయకులు గిరిబాబు, శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles