బతుకమ్మ చీరెలు రెడీ

Fri,August 23, 2019 02:58 AM

-జిల్లాకు చేరుకున్న 79 వేల బతుకమ్మ చీరలు
-లక్షా 97 వేల 872 మంది అర్హులు
-గోదాంలో నిల్వ చేస్తున్న చేనేత, మార్కెటింగ్ శాఖలు

అయిజ : బతుకమ్మ చీరల పంపిణీ కో సం అధికారులు కసరత్తు చేస్తున్నారు. వ చ్చే నెల 28న బతుకమ్మ పండుగ వస్తున్న నేపథ్యంలో ఆడపడుచులకు చీరలను పంపిణీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాకు అవస రమైన చీరలను టెస్కో ద్వారా రవాణా చేస్తున్నా రు. చేనేత, పౌరసరఫరాలు, మార్కెటింగ్, డీఆర్‌ఏవో అధికారులు చీరలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఆహార భద్రత కార్డులు కలిగి, అందులో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు సర్కారు కానుకగా బతుకమ్మ చీరను అందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసు కుంటున్నది. గత రెండేళ్ల అ నుభవాలను దృష్టిలో ఉం చుకుని ఈ ఏడాది చీరల పంపిణీలో ఎలాంటి ఇబ్బం దులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.

విభిన్న డిజైన్లతో బతుకమ్మ చీరలు
ఈ ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభు త్వం వివిధ విభిన్న రకాల డిజైన్లతో తయారు చేయిం చిం ది. మొదటి ఏడాది సమయాభావంతో సాదా చీరెలు పం పిణీ చేయగా, రెండో ఏడాది పక్కా ప్రణాళికతో 30 రంగు లు, ఝరీ అంచులతో కూడిన చీరలను ఆడప డుచు లకు పంపిణీ చేశారు. ఈ ఏడాది వాటికి అదనంగా చెక్స్, లైనిం గ్ తదితర డిజైన్ల ను చేర్చి 100 రకాల ఆకర్షణీయమైన డిజైన్లతో బతుకమ్మ చీరలను సిద్ధం చేసింది. ముంబైకి చెందిన నిపుణుల సహాయం తీసుకుని చీరలను సిరిసిల్లలోని మర మగ్గాలపై చీరలను ఉత్పత్తి చేస్తున్నారు.

లక్షా 97 వేల 872 మంది అర్హులు
జిల్లాలో 333 రేషన్ దుకాణాలు కలిగి ఉండగా, అందు లో లక్షా 97 వేల 872 మంది ఆడపడుచులు 18 ఏళ్లు నిండిన వారే. 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరను అందించాలని సర్కారు లక్ష్యం. అందకనుగుణంగా జిల్లాకు అవసరమైన చీరలను టెస్కో ద్వారా చీరలను జిల్లాకు రప్పిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 79 వేల చీరలను మార్కెటింగ్ శాఖ ద్వారా సరఫరా చేశారు. త్వర లోనే లక్షా 18 వేల 872 చీరలను సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని 12 మండలాలకు సరిపడా చీరలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles