అవగాహన కలిగి ఉండాలి

Fri,August 23, 2019 02:54 AM

మానవపాడు : ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అలంపూర్ మున్సిఫ్ కోర్టు జడ్జి రాధిక అన్నారు. గురువారం మండల పరిధిలోని చెన్నిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలనుసారం లీగల్ లెట్రసీ క్యాం పులు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉందని, కాని దానిని ఎవరూ హరించకూడదన్నారు. విద్యార్థులకు నేర్చుకునే గుణం ఉండాలని, అది విద్యార్థి దశ నుంచే మొదలవ్వాలని తెలిపారు. ఆగస్టు 9న మోటారు వాహన చట్టం సవరణ జరిగిందని, అది సెప్టెంబర్ 1 నుంచి అమలవుతుందన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే వేయి రూపాయల జరిమానా, అంబులెన్సుకు దారి ఇవ్వకుంటే రూ.20 వేల జరిమానా, మద్యం తాగి వాహనాలు నడిపితే రూ.10వేల జరిమానాతోపాటు జైలు శిక్ష ఉంటుందన్నారు. ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని అలా వెళ్లితే రూ.25 వేల జరిమానా విధిస్తారని, మైనర్లకు వాహనాలు ఇస్తే రూ.25 వేల జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందన్నారు. వాహనదారులు వాహనానికి సంబంధించి ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు.

విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ గతంలో కేసులు తక్కువగా నమోదయ్యేవని ,కాని ప్రస్తు తం నేరాల సంఖ్య బాగా పెరిగినందున న్యాయ స్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. నాటిన మొక్కల ను బాధ్యతగా పెంచాలని, పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమం లో హెచ్‌ఎం విష్ణువర్దన్, ఎస్సై గురుస్వామి, న్యా యవాదులు తిమ్మారెడ్డి, శ్రీనివాసులు, ఆంజనేయులు, సురేశ్, రాజేశ్వరి, వెంకట్రాముడు, పోలీసు సిబ్బంది, రియాజ్ బాష, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles