తుంగభద్రకు స్థిరంగా వరద

Fri,August 23, 2019 02:54 AM

అయిజ : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద స్థిరంగా వస్తోంది. ఎగువన వానలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర జలాశయానికి వరద నీరు తగ్గుతోంది. గురువారం తుంగభద్ర జలాశయానికి 32,191 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 10 గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 31,987 క్యూసెక్కులను నదిలోకి వి డుదల చేస్తున్నారు. టీబీ డ్యాంకు 100.855 టీఎంసీల నీటి నిల్వకు గాను ప్రస్తుతం 100.855 టీఎంసీలను నిల్వ ఉంచినట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ తెలిపారు. 1633 అడుగుల నీటి మట్టానికి 1633 అడుగుల నిల్వ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆర్డీఎస్ ఆనకట్టకు నిలకడగా..
తుంగభద్ర జలాశయం నుంచి విడుదలవుతున్న వరద నీరు ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద నిలకడగా కొనసాగుతోంది. టీబీ డ్యాం నుంచి విడుదలైన వరద అదేస్థాయిలో ఆనకట్టపై ప్రవహిస్తోంది. గురువారం ఆర్డీఎస్ ఆనకట్టకు 31,560 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా, ఆనకట్టపై రెండు అడుగుల మేర 26,330 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్ ఈఈ రామయ్య తెలిపారు. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి దిగువకు విడుదలవుతున్న వరద సుంకేసుల బ్యారేజీకీ చేరుతోందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి ఆయకట్టుకు 610 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆర్డీఎస్ డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి విడుదల అవుతున్న నీరు తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలలోని ఆయకట్టుకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

సుంకేసులకు కొనసాగుతున్న వరద
రాజోళి: సుంకేసుల బ్యారేజీకి ఎగువ నుంచి వరద వచ్చి చేరుతుంది. గురువారం 30వేలు ఇన్‌ఫ్లో రాగా, 27,500 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగింది. ఈ నీటి విడుదలకు అధికారులు 5గేట్లను తెరిచి శ్రీశైలంకు విడుదల చేసినట్లు జేఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles