జూరాలకు స్వల్పంగా వరద

Fri,August 23, 2019 02:54 AM

అయిజ : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద స్వల్పంగా కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టుల నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతుండటంతో జూరాల ప్రాజెక్టు స్పిల్‌వే గేట్లను అధికారులు మూసివేశారు. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులకు సైతం నీటి ప్రవాహం తగ్గుతోంది. ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతోంది. గురువారం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 24,000 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 20,621 క్యూసెక్కులు నమోదైంది. పవర్ హౌస్ ద్వారా 13,827 క్యూసెక్కులను నదిలోకి విడుదల చేస్తున్నారు. 318.516 మీటర్ల నీటి సామర్థ్యానికిగాను 318.51 మీటర్ల నీటిని నిల్వ చేశారు. 9.657 టీఎంసీల నీటి మట్టానికిగాను 9.645 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు ప్రవాహం వస్తుండటంతో కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది. కుడి కాల్వకు 502 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,190 క్యూసెక్కులు, సమాంతర కాల్వ ద్వారా 850 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకం పంపుల ద్వారా 2,250 క్యూసెక్కులు, బీమా లిప్టు -1300 క్యూసెక్కులు, బీమా లిప్టు -2 ద్వారా 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిప్టు ద్వారా 630 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. కృష్ణానది వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుండటంతో ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 20,551 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 991 క్యూసెక్కులు నమోదైంది. 129.72 టీఎంసీల నీటి సామర్థ్యానికి గాను 126.38 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నారాయణపుర ప్రాజెక్టుకు 11,390 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్‌ఫ్లో నిల్‌గా నమోదైంది, 37.64 టీఎంసీల సామర్థ్యం కలిగిన నారాయణపురలో ప్రస్తుతం 34.87 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles