డిజిటల్ ఖాతాలు పరిశీలించండి

Fri,August 23, 2019 02:53 AM

-తాసిల్దార్ల సమీక్షలో కలెక్టర్ శశాంక
గద్వాల, నమస్తే తెలంగాణ: సమగ్ర భూ సర్వేకు సంబంధించి డిజిటల్ సంతకం కాకుండా ఇంకా మిగిలిపోయి ఉన్న పార్ట్-ఏ, పార్ట్ బీ ఖాతాలు ఈ నెలాఖరులోగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ శశాంక తాసిల్దార్‌లను ఆదేశించారు. తన ఛాంబర్‌లో సమగ్ర భూ సర్వేపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు డిజిటల్ సంతకాలు కాకుండా పెండింగ్‌లో ఉన్న ఖాతాలపై పది కాలమ్స్‌లో కారణాలు వివరిస్తూ నివేదిక ఇవ్వాలని అదేశించారు. నేటి నుంచి ఒక్కో గ్రామాన్ని తీసుకుని అందులో వంద శాతం భూ సర్వే సమస్యలు పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని తాసిల్దార్లకు సూచించారు. మిగిలిపోయిన గ్రామాలేవైనా ఉంటే సెప్టెంబర్‌లో రైతు సదస్సు పేరిట ఆయా గ్రామాల్లో సదస్సులు ఏర్పాటుచేసి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఒక్క ఖాతా లేకుండా చూడాలన్నారు. జేసీ, ఆర్డీవో వద్ద ఉన్న కోర్టు కేసులు వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జేసీ నిరంజన్, ఆర్డీవో రాములు తాసిల్దార్లు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles