తల్లిదండ్రులను పోషించడం బాధ్యత

Thu,August 22, 2019 12:34 AM

అలంపూర్, నమస్తే తెలంగాణ: జన్మనిచ్చిన తల్లిదండ్రులను వారి సంతానం చివరి పయనంవరకు పోషించడం సంతా నం బాధ్యత అని అలంపూర్ మున్సిప్ కోర్టు జడ్జి రాధిక అన్నారు. బుధవారం కోర్టు ఆవరణలో నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా వయోజనులకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ కుటుంబంలో వృద్ధు లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంకోసం ఇదివరకే కోర్టులో దవాలు వేసుకుని ఉంటే అటువంటి వా టిని కుటుంబ సభ్యులతో మరో మారు చర్చించుకుని రాజీతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. కుటుంబంలో సంతా నం నుంచి ఎవరైనా పోషణ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటుంటే అటువంటి వారు కోర్టును ఆశ్రయించి తగిన న్యా యం పొందవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, సీనియర్ సిటిజన్స్, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles