సినీయర్ సిటిజన్‌లకు బాసటగా చట్టాలు

Thu,August 22, 2019 12:34 AM

గద్వాల క్రైం :సీనియర్ సిటిజన్స్ కూడా ఎవరైన ఇబ్బందులకు గురైతే బాధపడాల్సిన అవసరం లేదని వారికి రాజ్యాంగం పలు హక్కులను కల్పించిందని, వారికి చట్టం సీనియర్ బాసటగా ఉంటుందని గద్వాల కోర్టు జూనియర్ సివిల్ జడ్జి ఉషాక్రాంతి పేర్కొన్నారు. గద్వాలలోని విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో బుధవారం గద్వాల మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జి ఉషాక్రాంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏ ఇం టికైనా పెద్ద మనుషులుంటేనే సందడిగా ఉంటుంది..పెద్ద మనుషులు లోటున్న ఇంట్లో పంట పొలానికి రక్షణ లేకుంటే పరిస్థితి ఎలాంటి ఉంటుందో అలా ఉం టుందన్నారు.

వయసు మీద పడిన వా రిని మానవీయ కోణంలో చూసి వారి పట్ల ప్రేమాప్యాయతలను చూపాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృ ద్ధాప్య దశలో చిన్న చూపు చూడడ మో... చీదరించుకోవడమో చేయడం సరికాదన్నారు. వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు ప్రతి విషయంలో వారికి ఆసరాగా ఉండాలన్నారు. వృద్ధాప్య దశ లో ఒత్తిళ్లను జయించి... మానసిక ైస్థెర్యం తో..సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలని జడ్జి ఉషాకాంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి, న్యాయవాదులు సోమశేఖర్, నాగరాజు, వరలక్ష్మి, రిటైర్డ్ ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles