అట్టహాసంగా ప్రారంభమైన మహిళల టీ-10

Thu,August 22, 2019 12:33 AM

వనపర్తి రూరల్ : తెలంగాణలోని గురుకుల విద్యకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్నదని, ఇందుకోసం సీఎం కేసీఆర్ ఎంతోగానో కృషి చేస్తున్నారని వనపర్తి ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ తెలిపారు. బుధవారం మండలంలోని మర్రికుంట గ్రామంలోని ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో రాష్ట్ర స్థాయి బాలికల టీ-10 క్రికెట్ పోటీలను ప్రిన్సిపాల్‌తో పాటు బాలికల క్రికెట్ అకాడమీ డైరెక్టర్ ఆంజనేయులు లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎనిమిది రీజినల్ కోఆర్డినేటర్ స్థాయి గురుకుల పాఠశాలల నుంచి ఎనిమిది టీంలు వచ్చాయని, ఇక్కడికి వచ్చిన బాలికలకు అన్ని వసతులను ఏర్పాటు చేశామన్నారు. స్నేహభావంతో క్రీడల్లో పాల్గొనాలని, ప్రతి ఒక్క క్రీడాకారికి వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఇదొక మంచి అవకాశమన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో కోచ్ మన్నాన్, ఝాన్సీ, పీడి, పీఈటీలు శివ, రాధిక, శివాని తదితరులు పాల్గొన్నారు.
మ్యాచ్ వివరాలు..
-మొదటి మ్యాచ్‌లో ఆదిలాబాద్ టీంపై మహబూబ్‌నగర్ జట్టు 41 పరుగులతో విజయం.
-జయశంకర్ భూపాలపల్లి టీంపై రంగారెడ్డి జట్టు 10 పరుగులతో విజయం సాధించింది.
-మెదక్ టీంపై కరీంనగర్ ఒక్క పరుగుతో విజయం సాధించింది.
-నల్లగొండ టీంపై ఖమ్మం టీం 14 పరుగులతో విజయం సాధించింది.
-బెస్ట్ ప్లేయర్లుగా అనూష, రాజేశ్వరి, శైలజ, శ్రీతేజ నిలిచారు.
నేటి మ్యాచ్‌లు..
-గురువారం కరీంనగర్‌పై మహబూబ్‌నగర్, నల్లగొండపై భూపాలపల్లి జయశంకర్, ఆదిలాబాద్‌పై మెదక్, రంగారెడ్డిపై భద్రాది కొత్తగూడెం టీంలు తలపడనున్నాయి.
నేడు మంత్రి చేతుల మీదుగా అధికారంగా ప్రారంభం..
జిల్లా కేంద్రంలోని గిరిజన బాలిక గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న బాలిక రాష్ట్ర స్థాయి టీ-10 క్రికెట్ పోటీల కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా గురువారం ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ ఆంజనేయులు తెలిపారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles