పతి ఇంటినీ సర్వే చేయాలి

Wed,August 21, 2019 12:48 AM

-ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో రాజేంద్రకుమార్‌
గద్వాల టౌన్‌: క్షయ, కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రతి ఇంటిని సర్వే చేయాలని ఇన్‌చార్చి డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజేంద్రకుమార్‌ తెలిపారు. జాతీయ కుష్టు, క్షయ వ్యాధుల గుర్తింపు ఉద్యమం కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌ కార్యాలయంలో ఆశ కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తల సమావేశం మంగళవారం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే కోసం ప్రత్యేకంగా 338 బృందాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ప్రతీ బృందం రోజుకు 20 ఇండ్లను సర్వే చేయాల్సి ఉంటుందన్నారు. ఇండ్లల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పరీక్షించి వ్యాధి లక్షణాలు ఉన్నాయో లేదో గుర్తించాలన్నారు. లక్షణాలు ఉన్నైట్లెతే వారికి దగ్గర్లోని దవాఖానకు రెఫర్‌ చేయాలని సూచించారు. వ్యాధులపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, విధుల్లో నిర్లక్ష్యం సహించేదిలేదన్నారు. కార్యక్రమంలో డీపీఎంవో మల్లికార్జున్‌, సూపరింటెండెంట్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles