ర్యాగింగ్‌ చేస్తే శిక్షలు తప్పవు

Wed,August 21, 2019 12:48 AM

= సివిల్‌ జడ్జి రాధిక
వడ్డేపల్లి : విద్యార్థులు ఇతరులను మానసికంగా కించపరిచినా, ర్యాగింగ్‌ చేసినా శిక్షలు తప్పవని అలంపూర్‌ సివిల్‌ జడ్జి రాధిక అన్నారు. మండల కేంద్రంలోని శాంతినగర్‌లోని డిగ్రీ కళాశాలలో మంగళవారం సాయంత్రం విద్యార్థులకు చట్టంపై అవగాహన కల్పించారు. చట్ట వ్యతిరేక పనులు చేయరాదన్నారు. ముఖ్యంగా విద్యార్థులు సోదరీసోదర భావంతో మెలగాలన్నారు. ర్యాగింగ్‌, యాసిడ్‌ దాడులు, అత్యాచారాలు, ప్రేమ పేరుతో వేధింపులు, కిడ్నాప్‌, ఫోన్‌లో వేధింపులు చేస్తే వారికి జరిమానాతో పాటు, శిక్ష పడుతుందని అన్నారు. విద్యార్థుల మధ్య గొడవను ప్రోత్సహిస్తే కళాశాల యాజమాన్యంపై కూడా కేసులు తప్పవన్నారు. గొప్పవారిని ఆదర్శంగా తీసుకొని తాను జడ్జిని అయ్యానన్నారు. మీరు కూడా ఒక లక్ష్యంతో కష్టపడి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు అడిగిన సందేహాలకు ఓర్పుగా సమాధానాలు ఇచ్చారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ అతివేగంగా వాహనాలు నడపవద్దన్నారు. లైసెన్స్‌ కలిగి ఉండాలని, శిక్షపడితే కళాశాల నుంచి సస్పెండ్‌ అవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో లాయర్లు శాంతిమల్లప్ప, గవ్వల శ్రీను, సురేశ్‌, రాజేశ్వరి, తిమ్మారెడ్డి, కళాశాల బృందం సభ్యులు పాల్గొన్నారు.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles