బీచుపల్లిలో ప్రాయశ్చిత్త హోమం

Wed,August 21, 2019 12:48 AM

ఇటిక్యాల : పవిత్ర బీచుపల్లి క్షేత్రములోని కోదండ రామాలయంలో మంగళవారం ప్రాయశ్చిత్త హోమం నిర్వహించారు. కృష్ణమ్మ వరద ఉధృతికి వారం రోజులుగా వరద నీటి ఉండిన ఆలయాలను సప్రోక్షణ అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఆలయ ప్రధాన అర్చకులు నర్సింహమూర్తి, దినకరాచారి, భువనచంద్రలు కుంభారాధన, శాంతి హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. వరదల అనంతరం ఆలయాలలో నిత్యపూజలు నిర్వహిస్తున్నందున స్వామివారిని, జ్ఞాన సరస్వతి అమ్మవారిని అశేష సంఖ్యలో భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమాలను ఆలయ మేనేజర్‌ సురేందర్‌రాజు పర్యవేక్షించారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles