పాలమూరుకు గాలిమోటరు

Wed,August 21, 2019 12:48 AM

-మారిన లొకేషన్‌
-తున్కినీపూర్‌, వేముల, కనకాపూర్‌ మధ్య..
-474.05 ఎకరాల్లో సర్వే
-మూసాపేట మండలంలో రెండు చోట్ల పరిశీలన
-తుది నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం
-విమానయానశాఖ అధికారుల పరిశీలనే తరువాయి
మూసాపేట : మూసాపేట మండలంలోని తున్కినీపూర్‌, వేముల, కనకాపూర్‌ గ్రామాల మ ధ్యలో మంగళవారం సాయంత్రం రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. మహబూబ్‌నగర్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని గత రెండేళ్లుగా ప్రభుత్వ యంత్రాంగం సర్వే చేస్తున్న విషయం విధితమే. అందులో భాగంగానే మూసాపేట మండలంలోని జాతీయ రహదారి 44 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తున్కినీపూర్‌ గ్రామ శివారు మొదలుకొని అటు కనకాపూర్‌, ఇటు వేముల గ్రామ శివారు కలుపుకొని మొత్తం 474.05 ఏకరాలలో విమాశ్రయం ఏర్పాటు చేయడం కోసం సర్వే చేశారు. విమానాశ్రయం ఏర్పాటు చేయాలనుకునే స్థలం లో హైటెన్ష్‌న్‌ కంరెటు తీగలు ఉన్నాయా, స్థలంకు గుట్టలు ఎంత దూరం ఉన్నాయి. ప్రభుత్వ స్థలం ఎంత ఉంది. అనే వివరాలపై పరిశీలించారు. అదే విధంగా ఆ స్థలానికి కొంత దూరంలో మరో చో ట వేముల గ్రామ శివారులో కూడా మరో చోట స్థలాన్ని పరిశీలించారు. అయితే ఈ విషయంపై అధికారులు మాట్లాడుతూ విమానాశ్రయం ఏర్పా టు కొసం సాధ్యాసాధ్యలపై అంచనాల కోసం సర్వే చేస్తున్నట్లు ఆర్‌అండ్‌బీ డీప్యూటి ఈఈ సంధ్య చెప్పారు. ఆమె వెంట రెవెన్యూ శాఖ అధికారులు, స్థానిక వీఆర్వోలు వెంకట్‌రెడ్డి, కొండ ప్ప, సర్వేయర్‌ గోపాల్‌, స్థానిక సర్పంచ్‌ లక్ష్మణ్‌, మాజీ సర్పంచ్‌ బాలస్వామి, బుచ్చన్నగౌడ్‌ తదితరులు ఉన్నారు.

మొదట్లో మూసాపేటలోనే..
రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో విమానాశ్రయాల ఏర్పాటు ప్రకటించడంతో మొదట్లో మూసాపేట మండలంలోనే విమానాశ్రయం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించి సర్వే చేశారు. అందులో భాగంగానే వేముల, నందిపేట, దాసరిపల్లి గ్రామ మధ్యలో ఒకటి, మరోకటి జాతీయ రహదారికి పక్కనే సంకలమద్ది గ్రామ శివారులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఆ రెండు ప్రదేశాలలో విమానాశ్రయం ఏర్పాటుకు అనువుగా లేదని అధికారులు తేల్చారు. దీంతో సర్వే నిలిచిపోయి అడ్డాకుల మండలంలోని గుడిబండ గ్రామంలో సర్వే చేశారు. అక్కడ స్ధలం ఉన్నా హైటెన్ష్‌న్‌ వైర్లు ఎక్కువగా ఉండడంతో పాటు, మరి కొన్ని కారణాలతో అక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేయడం వీలుకాదని అధికారులు నిర్ణయించిట్లు సమాచారం. అందుకే మళ్లీ మూసాపేట మండలంలోని తున్కినీపూర్‌, వేముల గ్రామాల మధ్యలో సర్వే మొదలు పెట్టారు. ఇప్పడైనా విమానాశ్రయం మూసాపేట మండలంలో ఏర్పాటు అవుతుందా లేదా అనేది అధికారులు తేల్చాల్సి ఉంది.

పరిశీలన కోసం విమానయాన అధికారులు
అయితే విమానాశ్రయాల ఏర్పాటు విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తుది నివేదకలు ఇవ్వాలని ఆదేశించడంతో అధికారులు ఈ విషయంపై ముమ్మరంగా సర్వేలు మొదలు పెట్టారు. అందులో భాగంగానే మూసాపేట మండలంలోనే రెండు ప్రదేశాలను ఎంపిక చేసి సర్వే చేశారు. ఆ స్థలాలను విమానయాన శాఖ అధికారులు వచ్చి పరిశీలించిన తర్వాతనే విమానాశ్రయం ఏర్పాటు జరుగుతుందా లేదా అనే విషయం తేలనుంది.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles