ముగిసిన ఆరాధనోత్సవాలు

Mon,August 19, 2019 01:01 AM

-వైభవంగా సాగిన రథయాత్ర
-అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
గద్వాల టౌన్ : కలియుగ కల్పతరువు, కామధేనువుగా విరాజిల్లుతున్న మంత్రాలయ శ్రీ గురు రాఘవేంద్రస్వామి 348 వ ఆరాధనోత్సవాలు అత్యంత వైభవం గా ముగిసాయి. మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి 1008 శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీ పాదుల వారి ఆదేశానుసారం గత నాలుగు రోజులుగా జిల్లా కేంద్రంలోని షేరెల్లి వీధిలో గల రాఘవేంద్రస్వామి మఠంలో నిర్వాహకులు ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముగింపులో భాగంగా ఆదివారం మఠంలో స్వామివారికి ఉద యం 5గంటల నుంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్మాల్య విసర్జనం, అష్టోతర పారాయణం, తులసి అర్చన, ప్రహ్లాదుల పాదపూజ, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉద యం 9 గంటలకు స్వామి ఉత్సవమూర్తులను మహారథంపై ఊరేగించారు. పు రవీధుల గుండా గద్వాల కోటలోని భూ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం వరకు ఊరేగించి తిరిగి మఠం వరకు రథోత్సవాన్ని నిర్వహించారు. అలాగే కోటలోని ప్రధాన ఆలయం ప్రాంగణంలో స్వామివారిని ఊరేగించారు. అనంతరం సాయంత్రం మఠం నుంచి కోటలోని ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. అలాగే భీంనగర్‌లోని రాఘవేంద్రస్వామి ఆలయంలో, షేరెల్లి వీధిలోని పురాతన రాఘవేంద్రస్వామి ఆలయం లో మూడు రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధనోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ మేనేజర్ సంప్రతిమోహన్, విచారణ కర్త ప్రభాకర్, ప్రధాన అర్చకులు శ్రీనివాసచారి, ధనుంజయచారిలతో పాటు భక్తు లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles