కొనసాగుతున్న ధ్రువపత్రాల పరిశీలన

Mon,August 19, 2019 01:01 AM

పాలమూరు యూనివర్సిటీ: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పీజీ, బీఎడ్ ప్రవేశాల కోసం విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన మూడో రోజు బయాలాజికల్ సైన్స్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. ఆదివారం పీయూ అకాడమీ భవనంలో ఓఎస్‌డీ ప్రొఫెసర్ మధుసూదన్‌రెడ్డి, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నూర్జాహన్ సర్టిఫికెట్లను పరిశీలించారు. విద్యార్థుల ర్యాంకు కార్డులు, ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయించారు. మొత్తం మూడు జిల్లాల్లో విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత వెబ్ ఆప్షన్లు రెండు రోజులపాటు పెట్టుకోవచ్చని పేర్కొన్నారు. వెబ్ ఆప్షన్ల తర్వాత వారు కోరుకున్న కళాశాలలో సీట్లు అలాట్‌మెంట్ అవుతాయని, అప్పుడు వారు నచ్చిన కళాశాలలో సీటు పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పీయూలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మాత్రమే నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ నెల 24వ తేదీ వ రకు పరిశీలన కొ నసాగుతుందని అన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

23
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles