శ్రీశైలానికి 5,84,285 క్యూసెక్కులు

Sun,August 18, 2019 02:58 AM

అమ్రాబాద్ రూరల్ : జూరాల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలానికి వచ్చి చేరుతుంది. వరుద ప్రవాహం తగ్గుముఖం కావడంతో శుక్రవారం గే ట్లను 25 అడుగులకు తగ్గించి సాగర్‌కు వదులుతున్నారు. జూరాల నుంచి శ్రీశై లం వైపు 5.84 లక్షలకు పైగా వరద వస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండ లా మారింది. దీంతో అధికారులు శ్రీ శైలం ప్రాజెక్టు పది గేట్లను 25 అడుగు ల ఎత్తులో ఉంచి 6,57,932 నీటిని సాగర్‌కు వదులుతున్నారు. శనివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి జూరాల నుంచి స్ఫిల్‌వే ద్వారా మొత్తం 5,49, 500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరద, మొ త్తం శ్రీశైలం డ్యామ్ వైపునకు 5,84, 285 క్యూసెక్కుల వరుద వచ్చి చేరుతున్నది. ఈ ప్రాజెక్టు పూర్తీ స్థాయి నీటిమ ట్టం 885 అడుగులు కాగా శనివారం రాత్రి వరకు 881.70 అడుగులు, 197.4617 టీఎంసీల నీరు ఉ న్నది. మహత్మాగాంధీ లిప్ట్ ఇరిగేషన్ ఎ త్తిపోతలకు 2,400, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు 34,000, హంద్రీనివా ప్రాజెక్టు కు 2025 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. శ్రీశైలం టీఎస్ ఎడమ పవర్ హౌజ్ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చే స్తూ 38,140 క్యూసెక్కుల నీటిని, కుడిగట్టు ఆధ్రప్రదేశ్ విద్యుత్ పవర్ హౌజ్ ద్వారా 31,115 క్యూసెకులు విడుదల చేశారు. గత ఏడు రోజు రోజులుగా విద్యుత్ ఉత్పత్తిని ఎంత అవసరమో అందుకు తగినట్టుగానే ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles