రైతుకూ పింఛన్..!

Sat,August 17, 2019 12:44 AM

- ప్రధాన మంత్రి కిసాన్ యోజన పింఛన్ పథకం
-18 నుంచి 40 ఏండ్ల్ల మధ్య వయస్సు కలిగిన రైతులు అర్హులు
-వివరాల సేకరణకు కేంద్రం ఆదేశాలు
-జిల్లాలో 60 వేల మంది రైతులకు లబ్ధి
-మీ సేవ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం

అయిజ : రెక్కాడితే గాని ఢొక్కాడని దయనీయ స్థితిలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపీ కబురు అందించింది కేంద్ర ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశంలో ప్రధాన మంత్రి కిసాన్ పింఛన్ ప థకానికి ఆమోద ముద్రవేసింది. దీంతో 60 ఏళ్ల తర్వాత రైతుకు నెలనెలా రూ. 3 వేలు పింఛన్ అందజేస్తారు. ఈ పథకం అమలు చేసేందుకు ఇటీవలే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అన్ని రాష్ర్టాల వ్యవసాయశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. జిల్లాల వారీగా 18 నుం చి 40 ఏళ్ల వయస్సు ఉ న్న రైతుల వివరాలను సే కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నే పథ్యంలో వ్యవసాయశాఖ అధికారులు వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. అర్హులైన రైతులు మీ సేవ కేంద్రాలలో ఆ ధార్‌కార్డు, ప ట్టాదార్ పుస్తకం తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.

18 నుంచి 40 ఏండ్ల్ల వయస్సు
కలిగిన రైతులు అర్హులు ..
మోడీ ప్రభుత్వం రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత రైతులకు పింఛన్ స్కీం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి కిసాన్ పింఛన్ యోజన పథకం కింద రైతులకు పింఛన్ అందించను న్నా రు. పింఛన్ పొందాలంటే రైతులు రూ. 100 చెల్లిస్తే కేంద్రం అంతే మొత్తం లో జమ చేస్తుంది. ఎల్‌ఐసీ ద్వారా ఈ స్కీంను అమలు చేయనున్నారు. నెలకు రూ. 100 చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత రూ. 3 వేలు పిం ఛన్ ఇస్తారు. ఈ పథకానికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన రైతులు మా త్రమే అర్హులు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇటీవలే అ న్ని రాష్ర్టాల వ్యవసాయశాఖ మంత్రులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ పథకం కోసం 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రైతుల వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ పథకంపై రైతులకు అవగాహన కల్పిం చాలని పేర్కొ న్నారు. ప్రధాన మంత్రి కిసాన్ పథకం నమోదును వేగవంతం చేయా లని రాష్ర్టాల మంత్రులకు ఆదేశాలు జారీ చేయ గా.. అర్హులైన రైతులను గుర్తించా లని జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు సూ చించారు. ఈ మేరకు అధికారులు వివరా లను సేకరిస్తున్నారు.
జిల్లాలో 60 వేల మందికి లబ్ధి..
రెక్కాడితే గాని డొక్కాడని దయనీయ స్థితిలో రైతులు ఉన్నారు. శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు 60 ఏళ్లు పైబడినా చేతనైన పని చేయాల్సి వస్తోంది. 60 ఏళ్లు పైబడిన తర్వాత పింఛన్ ఇవ్వాలని ఎప్పటి నుంచో రైతుల డిమాండ్ ఉంది. రైతు ల కష్టాలను గుర్తించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అండగా నిలుస్తోంది. రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి రైతుల్లో ఆత్మ ైస్థెర్యాన్ని నింపుతోంది. అలాగే ఎప్పటి పిం ఛన్ కోసం ఎదురు చూస్తున్న రైతుల కల సహకారం కానుంది. రెండో సారి బీజేపీ ప్రభుత్వం అధికా రంలోకి రాగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో తొలి క్యాబినెట్ భేటీలో రైతు కోసం ప్రత్యేక పింఛన్ పథకాన్ని ఆమోదించింది. జిల్లా లో లక్షా 44వేల 445 మంది రైతులు ఉం డగా, 18 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగిన రైతులు 60 వేల మంది ఉన్నట్లు జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles