అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న : ఎమ్మెల్యే

Sat,August 17, 2019 12:39 AM

అన్ని దానాల కన్నా అన్నదానం మహాదానమని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యులతోనే సమాజంలో మార్పు వస్తుందని అందుకు నీలిమనే ఉదాహరణ అని చెప్పారు. నిరుపేదల ఆక లి తీర్చడం కోసం ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌కు అందరూ సహకరించాలని కోరారు. శుభకార్యా లు, హోటళ్లు, రెస్టారెంట్‌లలో మిగిలిన ఆహారా న్ని ఇక్కడ ఇస్తే పేదల కడుపు నింపినవాళ్లం అ వుతామని చెప్పారు. ప్రజలకు సహయ పడే ఎలాంటి అంశాలకైన తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మె ల్యే హామీ ఇచ్చారు. జిల్లాలోని మరి కొంత మంది దాత లు సమాజ సేవకోసం ముందుకు వస్తే జిల్లాను మరిం త అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని అన్నారు.

నీలిమా ఆర్యా మాట్లాడుతూ ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ఈ సెంటర్ ప్రారంభించుకోవడం సంతోషకరమని అన్నారు. ఇలాంటివి మరికొన్ని ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేశవ్, జెడ్పీ మాజీ చైర్మన్ భాస్కర్, పురపాలక సంఘం కమిషనర్ నర్సింహ, ఆర్టీసీ డీఎం మురళీదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles