స్వాతంత్య్ర వేడుకలు అదుర్స్

Fri,August 16, 2019 04:24 AM

ఇటిక్యాల: 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మండలంలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని బీచుపల్లి గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే అబ్రహం జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రిటీష్ పరిపాలన తదనంతర స్వాతంత్య్ర ఉద్యమం స్వతంత్ర భారత ఆవిర్భావం గురించి విద్యార్థులకు విపులంగా వివరించారు. కష్టపడి చదివి ఉన్నత స్థితికి చేరుకొని దేశసేవలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

అలాగే పదో పటాలంలో కమాండెంట్ జమీల్‌భాష జెండాను ఎగురవేశారు. అనంతరం కమాండెంట్ ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రామమహేశ్వర్‌రెడ్డి తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో రమేష్‌రెడ్డి లు అన్ని ప్రభుత్వ పాఠశాలలో, ఉపాధ్యాయులు, ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచులు జెండాను ఎగురవేశారు. ఎర్రవల్లి చౌరస్తా సరస్వతి పాఠశాలలో విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులు కాలనీలోని రోడ్ల వెంబడి మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో జెడ్పీటీసీ హన్మంత్‌రెడ్డి, ఎంపీపీ స్నేహ, సర్పంచ్ నర్సమ్మ, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సుందర్, తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles