స్టూడెంట్ ఇన్నోవేషన్

Fri,August 16, 2019 04:23 AM

గద్వాల, నమస్తే తెలంగాణ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే తెలంగాణ ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేషన్ అమల్లోకి తీసుకొచ్చిందని జెడ్పీ చైర్‌పర్సన్ సరిత పేర్కొన్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా గురువారం గద్వాలలోని పోలీస్ పరేడ్ గ్రౌం డ్‌లో విద్యార్థులు తాము చేసి ఆవిష్కరించిన వస్తువుల ను ప్రదర్శించారు. వారి ప్రదర్శనలను జెడ్పీ చైర్మన్‌తో కలెక్టర్ శశాంక, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాంలతో కలి సి పరిశీలించారు. ఈ సందర్భంగా అయిజకు చెందిన 9వ తరగతి విద్యార్థిని రూపొందించిన హెల్మెట్ సింగరేణి కార్మికులకు చాలా ఉపయోగపడుతుందని అన్నా రు.

ఈ విషయమైన సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్‌తో కలి సి వివరించాలని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు ప్రభు త్వం తరపున చేస్తానని కలెక్టర్ శశాంక విద్యార్థిని మహ్మదీకి చెప్పారు. ఉత్తనూరు పాఠశాల విద్యార్థి వంశీ రైతు ల కోసం రూపొందించిన బండి (మామ్ 2020)ని పరిశీలించారు. ఒకే పరికరంతో దున్నుకోవడం, రొప్పడం, గింజలు వేయడం, కలుపు తీయడం, మందులు పిచికారి చేసుకోవడానికి ఉపయోగపడేలా ఉండడం గొప్ప విషయమన్నారు. కారంపొడి మిషన్ తయారు చేసిన నజీర్‌ను జెడ్పీ చైర్‌పర్సన్, కలెక్టర్‌లు అభినందించారు. ఈ ముగ్గురు విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా ప్రోత్సాహకాలు అందజేస్తామని, వీరిని మిగతా విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles