అనుబంధాల రాఖీ

Thu,August 15, 2019 01:32 AM

-నేడు రాఖీ పౌర్ణమి
-అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకైన పర్వదినం

వనపర్తి సాంస్కృతికం: కాలం మారినా.. దూరం పెరిగినా.. చెరగనిది అన్నాచెల్లెల్ల అనుబంధం. అన్నాచెల్లెలు, అక్కా తమ్ముళ్ల అనురాగాలకు, ఆప్యాయతలకు ప్రతీక రాఖీ పండుగ.. జీవితంలో తనకు ఎల్లవేళలా రక్షణగా ఉండాలని, సాధన బాధకాల్లో తోడుగా నిలవాలని అక్కా చెల్లుల్లు అన్నదమ్ములకు రాఖీ కట్టడం ఆనవాయితీ. అన్నదమ్ములకు తప్పనిసరిగా రాఖీలు కట్టేందుకు ఆడబిడ్డలు పుట్టింటికి వెళ్తారు. వీలు కానివారు పోస్టు ద్వారా, ఆన్‌లైన్‌లోనూ.. తమ సోదరులకు రాఖీలు పంపుతారు.. నేడు రాఖీ పండుగ నేపథ్యంలో నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం.

యేల బద్దో బలీరాజ.. దానవేంద్రో మహాబలం.. తేన త్యాం అభి(రక్ష) బద్నామి.. రక్షే మాచల మాచల.. ఓ బలి చక్రవర్తి ఈ రోజు నేను నీకు రక్ష కడుతున్నాను. ఈ రోజు నుంచి నేను నీకు సహోదరిని కాబట్టి ఈ రోజు నుంచి నాకు నువు సహోదరుడిగా ఉంటూ నిరంతరం రక్షణ కల్పించాలి అని ఇంద్రుని భార్య శచిదేవి బలిచక్రవర్తితో అన్నట్లు మన పురాణాలు చెబుతున్నాయి. రాఖీతో ఏర్పడిన రక్షణ బంధం ఈనాటిది కాదని పురణాల నుంచి మనకు సంక్రమించిందని చెప్పడానికి ఎన్నో కథలు ప్రా చూర్యంలో ఉన్నాయి. అక్కాతమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీకగా నిలుస్తున్న రాఖీ పండుగను ప్రతి శ్రావణ పౌర్ణమి రోజు అనేక మంది ఎంతో సంతోషంతో జరుపుకుంటున్నారు. శ్రవణ మాసంలో వచ్చే పౌర్ణమి అని, కొందరు జంధ్యాల పౌర్ణమి అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం రాఖీ పౌర్ణ మి అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని గుర్తు చేసే పం డుగగా పాటిస్తారు. సోదరులు సోదరిలతో రాఖీ కట్టించుకుని వా రికి కట్న, కానుకలను అందజేయడం ఆనవాయితీగా వస్తుంది.

శ్రావణ పౌర్ణమి తెలుగువారికి రాఖీ, జంద్యాల పౌర్ణమి
రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, జంద్యాల శ్రావణ పౌర్ణమి ఇలా ఎన్నో రకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సవాలతో ఈ పండుగను జరుపుకుంటారు. ఏదో బద్దో బలిరాజా దానావేం ద్రో మహబలాతేనత్వం అనుబందాధామి రక్షమాంచ మాంచ లం అంటూ రక్షణ కోరిన తన సోదరిని బలి చక్రవర్తి రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలెదురైనా తడబడక ధైర్యంతో ఎదురొడ్డి నిలిచాడు. అటువంటి మహావీరునితో తన సోదరుడిని పోలుస్తూ సోదరి తనకి రక్షణ నివ్వమని కో రుతుంది. రాఖీ కట్టిన సో దరికి తగిన బహుమానం ఇస్తూ ఆశీర్వదిస్తాడు. సా ధారణంగా జం ధ్యాన్ని ధరించే వారు ఈ రోజునే పాతది వదిలి, కొత్త దాన్ని ధరిస్తారు. దీనినే ఉపకర్మ అంటారు. ఉపకర్మను య జ్ఞోపవీతం పేరుతో పిలుస్తారు. నూలుతో తయా రు చేసిన జంధ్యాన్ని ధరించడమే దీనికి కారణం. యజ్ఞోపవీతం ధరించిన వారు ద్విజులు, ద్విజులు అంటే రెండు జన్మలు కలవారని అర్థం. తల్లి గర్భం నుంచి జన్మించడం మొద టి కాగా, ఉపనాయనం అనంతరం గురువు నుంచి జ్ఞానాన్ని పొందడం రెండవది. ఉపనయనం సమయంలో యజ్ఞోపవిత్రానికి జింక చర్మాన్ని కడుతారు. దీనిని ఉపకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి రోజు వదలిపెడుతారు. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయిత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవితాన్ని ధరించి పాతది విసర్జించాలి. పరిపక్వతకు, పరిశుద్దతకు యజ్ఞోపవితం దివ్యౌషదం, ఇది ఉపనయన సంస్కారం ఉన్నవారికే పరిమితమైనా మిగతావారు కూడా అష్టోత్తరాలతో గాయిత్రీ దేవిని పూజిస్తే శుభాలు కలుగుతాయి.

జై సంతోషి మాత జన్మదినం..
కఠిన నియమ, నిబంధనలతో ఎంతో మంది భక్తితో కొలిచే జై సంతోషి మాత జన్మదినోత్సవాన్ని శ్రావణ మాస పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. గణపతి దేవుని పుత్రికగా జన్మించిన సంతోషి మాత ఈ రోజున ఆ దేవ దేవునికి రాఖీ కట్టడం వల్లనే శ్రవణ పౌ ర్ణమిని రాఖీ పౌర్ణమిగా పాటిస్తున్నారనే కథ ప్రచారంలో ఉంది. అందు వల్ల రాఖీ పౌర్ణమి రోజున సంతోషిమాత ఆలయాల్లో జన్మదినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

శ్రీ కృష్ణుడు, ద్రౌపదిల అనుబంధానికి ప్రతీక..
అందరు తమ ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీకృష్ణుడు, పాండవుల సతీమణి ద్రౌపదిల అనుబంధానికి ప్రతీకైన రాఖీ పండుగ గురించి ఇతిహాసాల్లో ఎంతో గొప్పగా వర్ణించారు. శ్రీకృష్ణుడు శిశుపాలున్ని వధించే సమయంలో తన చేతులోని సుదర్శన చక్రాన్ని విసిరినప్పుడు ఆ కృష్ణ భగవానుడి చూపుడు వేలుకి గాయం అవుతుంది. దీని కారణంగా రక్తం కారి తే అక్కడే ఉన్న ద్రౌపది తన చీర కొం గును చింపి తన సోదర సమానుడైన శ్రీకృష్ణుని వేలికి కడుతుంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఏ సమయంలోనైనా తనను తలచుకుంటే అప్పుడు అం డగా ఉంటానని ద్రౌపదికి వరం ఇస్తాడు. ఆ రోజు ఇచ్చిన వరం ప్రకారమే ద్రౌపదిని వస్ర్తాభరణ సమయంలో శ్రీకృష్ణుడు కాపాడుతాడు.

అలెగ్జాండర్ ప్రాణాన్ని కాపాడిన రక్షాబంధన్
అఖండ భారతావనిని జయించాలనే కాంక్షతో దండయాత్రకు వచ్చి తక్షశిల మహారాజు పురుషోత్తముని చేతిలో ఓటమి పాలైన అలెగ్జాండర్ ప్రా ణాలను కాపాడడానికి అతని భార్య రో క్సానా రక్ష బంధన్‌ను వినియోగించుకన్నట్లు చరిత్రకారులు వివరించారు. పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించిన రోక్సానా అతనికి రాఖీ కట్టి యుద్ధంలో ఓడిన తన భర్త అలెగ్జాండర్ ప్రాణాలను కాపాడుకుటుంది. ఇలా రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి పండుగకు ఎ న్నో విశిష్టతలున్నాయి. అందుకే రాఖీ పండుగను అందరు ఎంతో సంతోషం గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles