గుర్తు తెలియని మహిళ మృతి

Thu,August 15, 2019 01:27 AM

ఉండవెల్లి : గుర్తు తెలియని వాహనం ఢీకొన్న సంఘటనలో మహిళ మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించిన ఎస్సై విజయ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. కర్నూల్ వైపు నడుచుకుంటూ వెళుతున్న గుర్తు తెలియని మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొన్నది. దీంతో మహిళ అక్కడికికక్కడే మృతి చెందింది. హైవే సిబ్బంది సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించారు. మృతురాలు గులాబీ కలరు చీర, నశనం కలరు జాకెట్, కాళ్లకు మెట్టెలు, తాళి, కుడి కాలుకు తెల్లమచ్చలున్నాయని తెలిపారు. మృతదేహాన్ని అలంపూర్ ప్రభుత్వ దవాఖానలో భద్రపర్చామని తెలిపారు. మృతురాలి ఆచూకి తెలిసిన వారు ఉండవెల్లి పోలీసులను సంప్రదించాలని సూచించారు. హైవే సిబ్బంది మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొన్నసాగి స్తున్నట్లు ఎస్సై తెలిపారు.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles