కేజీబీవీలో ఇంటర్‌నేషనల్ యూత్ డే

Tue,August 13, 2019 12:56 AM

గద్వాల న్యూటౌన్: మండలం గోనుపాడులో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో సోమవారం బర్డ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్‌నేషన ల్ యూత్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ కమలాదేవితో పాటు డీసీపీవో కుసుమలత, మండల విద్యా శాఖాధికారి ప్రతాప్‌రెడ్డి, న్యాయవాది వరలక్ష్మిలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై ఏకాగ్రతను పెంచుకు ని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. దేశభవిష్యత్ యువత నైపు ణ్యం ఆధారపడి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థి తమ లక్ష్యాలను గొప్పగా ఎంపిక చేసుకోవాలన్నారు. విద్యను అన్నివిధాలుగా పెంపొందించేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టిందన్నారు. అనంతరం వారు యూత్ డేకు సంబం ధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేజీబీవీ ఎస్‌వో శ్రీదేవి, చైల్డ్‌లైన్ కౌన్సిలర్ నర్సింహ, బర్డ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు నర్సింహులు, ప్రవీణ్, దుర్గ, సురేఖ తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles