జోగుళాంబను దర్శించుకున్న ప్రముఖులు

Tue,August 13, 2019 12:55 AM

అలంపూర్, నమస్తే తెలంగాణ: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను సోమవారం పలువురు ప్రముఖులు ఆలయాలను దర్శించుకున్నారు. వనపర్తి జిల్లా జేసీ వేణుగోపాల్, కెనరాబ్యాంక్ డీజీఎం శ్రీనివాస్ కుటుంబ సమేతంగా వేర్వేరు సందర్భాల్లో ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అంతుకు ముందు వారికి ఆలయాధి కారులు ఈవో ప్రేమ్‌కుమార్ అర్చకులతో కలిసి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. తుంభద్రా నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో భక్త యాత్రికులు ఉల్లాసంగా నదిలో స్నానాలు ఆచరించారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles