అప్రమత్తంగా ఉండండి

Tue,August 13, 2019 12:55 AM

అయిజ రూరల్: కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్రానది సోమవారం పరవళ్లు తొక్కడం తో ఆర్డీవో రాములు, తాసిల్దార్ కిషన్‌సింగ్ మండ లంలోని వేణిసోంపురం, కేశవరం, కుట్కనూరు, రాజాపురం గ్రామాల్లో పర్యటిం చి నదీ ప్రవాహాన్ని పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. ఎవరూ కూడా నదీపరిసర ప్రాంతాలకు వెళ్లొద్దని చె ప్పా రు. అలాగే జాలర్లు ఎవరూ చేపట వేటకు వెళ్లొద్దని తెలిపా రు. నదీపరిసర ప్రాం తాల్లో పొలాల వద్ద నివాసం ఉం టున్న రైతులందరూ సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని చెప్పారు. ఇందుకు గాను ఆయా గ్రామాల వీఆర్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు ఎప్పటికప్పుడు నదీప్రవాహంపై ప్రజలకు సమాచారమందిచాలన్నారు. ఆయనతోపాటు తాసిల్దార్ కిషన్ సింగ్, ఆర్‌ఐ లక్ష్మిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లువీఆర్‌వో లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు ఉన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles