రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

Mon,August 12, 2019 02:48 AM

రాజాపూర్: మండలంలోని ముదిరెడ్డిపల్లిలోని జాతీయ రహ దారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలకు తీవ్రగాయాలైన సంఘటన చోటుచేసుకుం ది. ఏఎస్సై శ్రీనివాస్‌రావు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నారాయణగౌడ్ అన్న కుమార్తె భజగానీ రజిత ఆమె భర్తబాలగౌడ్ గుడిమల్కపూర్ నుం చి ద్విచక్రవాహనంపై ముదిరెడ్డిపల్లికి వస్తుండగా, రోడ్డుదాటుతున్న క్రమంలో హైదరాబాద్ నుంచి జడ్చర్లవైపు వెళ్తున్న కారు వేగం గా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలగౌడ్ తలకు బలమైన గాయాలైయ్యాయి. అలాగే రజితకు తల వెనుక, వెన్నుపూసకు గాయాలు కావడంతో హుటహూటి ఏస్వీఎస్‌దవాఖానలో చికిత్స అందించి, మెరుగైన వైద్యంకోసం మలక్‌పేట యశోద దవాఖానకు తరలించారు. ప్రమాదంపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై తెలిపారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles