విద్యుదాఘాతంతో పశువులు మృతి

Mon,August 12, 2019 02:47 AM

వీపనగండ్ల: మండలంలోని సంపట్రావుపల్లి గ్రామం ఊరచెరువు సమీపంలో విద్యుదాఘాతంతో రెండు ఆవులు, రెండు బర్రెలు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం సంపట్రావుపల్లి గ్రామానికి చెందిన మోజర్ల నడిపి బాలస్వామి, లంబడి వెంకటస్వామిలకు చెందిన చెరొక్క ఆవుతో పాటు ఓరే బాలస్వామి, బెల్లరి నాగయ్యలకు చెందిన చెరొక్క బర్రె మొత్తం నాలుగు పశువులు రోజు వారిగా మేతకోసం వెళ్లగా కిందపడిన విద్యు త్ తీగలకు తగిలి అక్కడిక్కడే మృతిచెందినట్లు తెలిపారు. విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రమాదకర విద్యుత్ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నష్టం సంభవిస్తున్నట్లు స్థానికులు తెలిపా రు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోని బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు కోరారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles