అప్రమత్తంగా ఉండాలి

Sun,August 11, 2019 03:09 AM

-నాగర్‌దొడ్డిలో ఆర్‌అండ్‌ఆర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం
- కలెక్టర్ శశాంక
కేటీదొడ్డి : నారాయణపూర, జూరాల ప్రాజెక్ట్‌ల నుంచి దాదాపుగా 6లక్షల క్యూసెక్కుల నీరు దిగువనున్న శ్రీశైలం డ్యాంనకు అధికారులు విడుదల చేసున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శశాంక సూచించారు. ధరూర్ మండల పరిధిలోని నదీ తీరాన ప్రాంతం నాగర్‌దొడ్డి గ్రామాన్ని శనివారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతుంది కాబట్టి ప్రజలు ఎప్పుడు నిఘాతో అప్రమత్తంగా ఉండాలన్నారు.

ముంపు గ్రామంగా ఉన్న నాగర్‌దొడ్డి గ్రామానికి ఇంత వరకు ఆర్ అండ్ ఆర్ సెంటర్ కాకపోవడం ఏంటని గ్రామస్తులను కారణాలను అడిగి తెలుసు కున్నారు. త్వరలోనే ఈ సమస్యను తీర్చుతామని ఆయన హామీ ఇచ్చారు.ఒక ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్‌తో పాటు అధికారులు కూడా గ్రామంలో ఉండి ప్రజలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, నడిఒడ్డున ఉన్న తమ గ్రామం లోకి పాములు, మొసళ్లు, విషపూరితమైన పురుగులు వస్తున్నాయని దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీనిపై అధికారులు స్పందించాలని కలెక్టర్‌కు గ్రామస్తులు వినవించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కృష్ణయ్య, మాజీ వైఎస్ ఎంపీపీ నాగర్‌దొడ్డి వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles