కల్యాణ వేంకటేశ్వరునికి లక్ష పుష్పార్చన

Sun,August 11, 2019 03:05 AM

గద్వాలటౌన్/అర్బన్: కల్యాణ వేంక టేశ్వరునికి లక్షా పుష్పాలను భ క్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించుకున్నారు.. పండితుల వేద మంత్రో శ్చరణలో నదీ తీరం మార్మోగింది... స్వామిని దర్శించు కునేందుకు అనేక మంది భక్తులు తరలివచ్చారు. జిల్లా కేంద్రం గద్వాల సమీపాన ఉన్న నదిఆగ్రహరంలో కృష్ణానది తీరాన కొలువు తీరిన శ్రీ కల్యాణ వేంకటే శ్వరస్వామికి శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకుల ఆధ్వ ర్యంలో శనివారం లక్ష పుష్పాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. అంతకుముందు స్వామి వారికి విశేష ఫల పంచామృతాభిషేకాలు అర్చకులు నిర్వహించారు. అలాగే ఉత్సవ మూర్తులకు జలాభిషేకం చేశారు. సాయంత్రం గురుడ వాహనంపై స్వామి వారిని ఊరేగించారు. అలాగే కృష్ణమ్మకు మహ హా రతిని సమర్పించుకున్నారు.అర్చకులు మణూరు ప్రహ్లాదచార్యులు, మణూరు ప్రసన్నచార్యులు, శ్రీవత్సచార్య, నరేషాచార్య, మురళీకృష్ణశర్మ పాల్గొన్నారు.

నదీ తీరాన స్వామివారి పల్లకీ సేవ
గద్వాల న్యూటౌన్ : నది అగ్రహారంలో శనివారం సాయంత్రం కల్యాణ వేంకటేశ్వరునికి పల్లకీ సేవ అత్యంత వైభవంగా జరిగింది. నదీ తీరాన వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ఆలయం వరకు పల్లకీలో ఊరేగించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles