పులకించిన చెన్నకేశస్వామి ఆలయం

Sun,August 11, 2019 03:04 AM

గద్వాలటౌన్ : హరినామ సంకీర్తనలు..అన్నమయ్య కీర్తనలు.. భజన పరుల తాళాల మోత లు..డోళ్ల చప్పులతో కోటలోని శ్రీ భూలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆ లయం పులకించిపోయింది. శ్రా వణ మాసాన్ని పురస్కరించుకు ని వీహెచ్ పీ, ఆలయ నిర్వాహకులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భజన కార్యక్రమాలు శనివారం కూడా కొనసాగాయి. కార్యక్రమంలో భాగంగా భజనపరులు, వీహెచ్‌పీ నాయకులు, భక్తులు భజనలో పాల్గొని కీర్తనలు ఆలపించారు. అంతకుముందు స్వామి వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. విశేష అలకంరణలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7గంటలకు స్వామి వారిని ప్రత్యేక రథంపై ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles