వనపర్తిలో 23 గ్రామాలకు

Sun,August 11, 2019 03:04 AM

పెబ్బేరు రూరల్ : కృష్ణానది వరద పోటెత్తడంతో శనివారం సా యంత్రం రంగాపురం పుష్కరఘాట్ పూర్తిగా మునిగిపోయింది. పుష్కరాల సమయంలో ఏర్పాటు చేసిన కృ ష్ణవేణి విగ్రహం, శిలాఫలకం, విద్యుత్ స్తంభాలు మునిగి కొద్దిగా బయటికి కనిపిస్తున్నాయి. 44 వ నంబర్ జాతీయరహదారిపై ఉన్న బీచుపల్లి వంతెనపై నుంచి వెళ్లే ప్రయాణికులు వరద ప్రవాహాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఒక్కసారిగా వరద రావడంతో నదీతీరంలోని పంట పొలాలకు ముప్పు ఏర్పడింది. వరి పంటతో పాటు పలు రకాలైన తోటలలోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles