వరలక్ష్మీ నమోస్తుతే!

Sat,August 10, 2019 03:10 AM

-భక్తి శ్రద్ధలతో సామూహిక వ్రతాలు, కుంకుమార్చనలు
-కిటకిటలాడిన ఆలయాలు
-వాయినాలు ఇచ్చిపుచ్చుకున్న మహిళలు

గద్వాలటౌన్ : వరాలీయమ్మా.. వరాలలక్ష్మి.. మమ్మల్ని చల్లంగా కా పాడమ్మా తల్లీ అంటూ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వేదనగర్‌లోని శంభునాథ మఠంలో నిర్వహిస్తున్న సరస్వతి శిశు మందిరం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. అలాగే హౌసింగ్ బోర్డులోని శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయంలో, కన్యకాపరమేశ్వరి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. అలాగే అమ్మవారికి కుంకుమార్ఛన చేసి తమని ఎల్లవేళలా కాపాడాలని ఆ తల్లిని వేడుకున్నారు. అంతకు ముందు ఆలయంలో శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజ లు నిర్వహించి అభిషేకాలు చేశారు. అలాగే కొందరు మహిళలు తమ ఇళ్లలో అమ్మవారి వ్రతాన్ని ఆచరించి వాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు.

వైభవంగా వరలక్ష్మీ వ్రతం
అయిజ : పట్టణంతోపాటు మండలంలోని పలు ఆలయాలు, గృహాల్లో వరల క్ష్మీ వ్రతాన్ని వైభవంగా జరుపుకున్నారు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని భక్తులు లక్ష్మీ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజ లు చేశారు. ప్రతి ఏటా వరలక్ష్మీ వ్రతా న్ని భక్తులు ఘనంగా జరుకుంటారు. ప ట్టణంలోని కట్ట కింద తిమ్మప్ప స్వామి, తిక్కవీరే శ్వరస్వామి ఆలయాలతోపాటు అంభ భవాని, వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయాల్లో భక్తులు అమ్మవార్లకు పూజలు చేశారు. సాయంత్రం ఆయా ఆలయాల్లో కుంకుమార్చన చేశారు. ఈ సందర్భంగా ముత్తైదువులు ఒక్కరికొకరు వాయినాలు సమర్పించుకున్నారు.

బీచుపల్లి క్షేత్రంలో..
ఇటిక్యాల : శ్రావణమాసం రెండో శుక్రవారం బీచుపల్లి క్షేత్రంలో కోదండరామాలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా నలుమూలల నుంచి అశేషసంఖ్యలో విచ్చేసిన భక్తులు సామూహిక వరలక్ష్మీ వ్రతాల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు నర్సింహామూర్తి మహిళలచే అమ్మవారి వ్రతాల ను నిర్వహించారు. అనంతరం అమ్మ వారి ఆశీస్సులు తీర్థప్రసాదాలను అంద జేశారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు పర్యవేక్షించారు.

కేటీదొడ్డి మండలంలో.
కేటీదొడ్డి : మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పూజలు నిర్వహించారు. అమ్మవారికి పూలు, పండ్ల తో పాటు నైవేద్యం సమర్పించి మొ క్కులు తీర్చుకున్నారు. మహిళలు ఉదయాన్నే లేచి వరలక్ష్మీదేవికి పూజలు చేసి ఉపవాసం ఉన్నారు. మం డలంలోని కొండాపురం గ్రామంలో సర్పంచ్ జయమ్మ వరలక్ష్మీదేవికి పూజ లు చేసి గ్రామ మహిళలకు ప్రసాదాలు అందజేశారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles