కలెక్టర్‌కు వినతిపత్రం అందచేసిన సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు

Sat,August 10, 2019 03:07 AM

గద్వాల అర్బన్ : జోగుళాంబ గద్వాల జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పన కల్పించాలని సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు జిల్లా కలెక్టర్ ను కోరారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ శశాంకకు వినతిపత్రం శుక్రవారం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 371 జీ అనుసరించి ప్రధానమంత్రికి విన్నవించిన అంశంలో జిల్లా కేంద్రంలో స్వయం ఉపాధి పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతీ, యువకులకు వారి కులవృత్తి ఉపాధి అవకాశాలు కల్పించి వారికి ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఫోరం సభ్యులు మోహన్‌రావు, రామన్‌గౌడ్, ఉలిగేపల్లి వీరయ్య, మల్లేశప్ప, చక్రధర్ తదితరులు ఉన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles