మొక్కలు తొలగించిన రైతుపై కేసు నమోదు

Sat,August 10, 2019 03:07 AM

గట్టు : హరితహారంలో భాగంగా ఉపాధి హామీ పథకం కింద నాటిక మొక్కలను తొలగించిన రైతుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ చెప్పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లందొడ్డి-గట్టు రోడ్డు పక్కన ఇటీవలనే హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటారు. అయితే ఎల్లందొడ్డికి చెందిన గోకారి అనే రైతు మొక్కలు పెద్దవైతే తన పొలానికి నీడ వస్తుందనే కారణంగా, అతని పొలం పరిధిలో రోడ్డు పక్కన ఉన్న 13 మొక్కలను తొలగించాడన్నారు. నాటిన మొక్కలను తొలగించిన విషయంపై పంచాయతీ కార్యదర్శి శివన్న ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం రైతు గోకారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles