దరఖాస్తు చేసుకోండి

Sat,August 10, 2019 03:06 AM

గద్వాల,నమస్తేతెలంగాణ: జిల్లాలోని బీసీ, ఈబీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి ప్రభుత్వం చేపట్టిన మహాత్మాజ్యోతిబాపూలే బీసీ విదేశి విద్యానిధి పథకం ద్వారా సహాయం పొందాలనుకునే అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఇందిర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన బీసీ విద్యార్థులు ఈనెల 31 సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు www.telanganaepass.cgg. gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు జూలై 1నాటికి 35సంవత్సరాల లోపు వారై ఉండాలన్నారు.

తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5లక్షలకు మించరాదని ఇంజనీరింగ్, సైన్స్, వైద్యం మేనేజ్‌మెంట్, వ్యవసాయం, నర్సింగ్ సామాజిక శాస్ర్తాల్లో అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో 60శాతానికి పైగా మార్కులు వచ్చిన వారు దరఖాస్తు చేసుకో వచ్చని చెప్పారు. ఎంపికైన వారికి రెండు విడతలుగా రూ.20లక్షలు మం జూరు చేస్తారని తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కుల, ఆదాయ, స్థానిక, జనన ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆదార్, ఈ పాస్ ఐడీ నెంబర్, పాస్‌పోర్టు, విద్యా అర్హతల పత్రాలతో పాటు బ్యాంక్ పాస్‌బుక్‌తో పాటు ఫొటోలను జతపర్చాలని సూచించారు.

పూర్తి వివరాలకు తమ కార్యాల యంలో సంప్రదించాలన్నారు.
పూర్తి నివేదిక ఇవ్వండి : కలెక్టర్ శశాంకగద్వాల,నమస్తేతెలంగాణ: జిల్లాలో ఇప్పటి వరకు ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం, సహాజ వనరుల నిర్వాహన ద్వారా రూ పొందించుకున్న లక్ష్యాలు, ఇప్పటి వరకు సాధించిన ప్రగతిపై వివరాలతో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ వాటర్‌షెడ్ ప్రాజెక్టు అధికారి నర్సింహారెడ్డిని ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశపు మం దిరంలో జిల్లాలో ప్రధామంత్రి క్రిషి సంచాయి యోజనతో పాటు వివిధ రకాల పథకాల ద్వారా జిల్లాలో చేపట్టిన పనులపై వాటర్‌షెడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2009-10 నుంచి 2016-2017 వరకు నాలుగు బ్యాచ్‌లు పనిచేశాయని ఇప్పటి వరకు జిల్లాలో 67 వాటర్‌షెడ్‌లు నిర్మించ డం జరిగిందని ఇప్పటికే రెండు బ్యాచ్‌లు పూర్తి అయ్యాయని మిగిలిన బ్యాచ్‌లు ఆగస్టు 15తో కాల పరిమితి పూర్తి అవుతున్నాయని ప్రాజెక్టు అధికారి కలెక్టర్ దృష్టికి తీసుకవచ్చారు. అందుకు స్పందించిన కలెక్టర్ బ్యాచ్‌ల వారీగా డీపీఆర్‌లో ఎంత లక్ష్యం నిర్ధేశించుకున్నారు, సాధించిన లక్ష్యాలు ఖర్చు వివరాలు ఈ నెల 13వ తేదీ వరకు సమర్పించాలని ఆదేశించారు. నిర్మించిన వాటర్‌షెడ్లు ఎక్కడ ఉన్నాయి ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాయో ఈ నెల మూడో వారంలో స్వయంగా క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలిస్తానని కలెక్టర్ వారికి తెలియజేశారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles