పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేయండి

Sat,August 10, 2019 03:05 AM

గద్వాల,నమస్తేతెలంగాణ: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వ హించుకోవడానికి పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూ ర్తి చేయాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం అధికారులతో కలిసి పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ వచ్చే అతిథులకు, ఉద్యోగులకు , ప్రజలకు, విద్యార్థులకు వారికి అ నుగుణంగా కూర్చోవడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోలీస్, పరేడ్ శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సరియైన ఏర్పాట్లు చేయాలన్నారు.

మై దానంలో ప్రజలు వీక్షించడానికి పెద్దతెర ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప్రజలు వీక్షించడానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. మంచినీటి సౌకర్యం, అందరికి స్నాక్స్‌తో పాటు మరుగుదొడ్లు ఏ ర్పాట్లు చేయాలని పురపాలక సంఘ క మిషనర్ నర్సింహాకు ఆదేశించారు. పో లీస్ అధికారులతో సమన్వయం చేసుకుని ఆర్‌అండ్‌బీ, పౌరసరఫరాలశాఖ, జిల్లా పౌరసంబంధాలశాఖ కలిసి ముం దస్తుగా పకడ్బందీ ప్రణాళికలు త యా రు చేసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఏఎస్పీ కృష్ణ, ఆర్డీవో రాములు, డీఎస్పీ షాకీర్‌హుస్సేన్, ఆర్ అండ్‌బీ ఈఈ పద్మనాభరావు, డీఈ కిరణ్ కుమార్, డీఎస్‌వో చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles