ఓటర్ల జాబితాలో తప్పులుండొద్దు

Sat,August 10, 2019 03:04 AM

గద్వాల, నమస్తే తెలంగాణ: ఎన్నికల కమిషన్ ద్వారా 2020 సంవత్సరానికి ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూలు విడుదల చేసినందున, ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా రూపొందించాల్సిందిగా జిల్లా కలెక్టర్ శశాంక తాసిల్దార్‌లను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఛాంబర్‌లో స్పెషల్ సమ్మర్ రివిజన్ 2020 ప్రణాళిక పై సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో హడావిడి చేసి ఓటర్ జాబితాలో తప్పులు వస్తుంటాయి కాబట్టి ఎన్నికల సంఘం 1-1-2020 తేదీని 18 సంవత్సరాల ఆధారంగా పెట్టిందన్నారు.


దీని ప్రకారం అంతకు ముందు 18 ఏండ్లు పూర్తిచేసుకున్న వారందరు ఓటర్ జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవడానికి అర్హులవుతారని చెప్పారు. అందువల్ల ప్రతి మండలంలో స్వీప్ ద్వారా ఓటర్ నమోదు తొలగింపుపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఆగస్టు 16వ తేదీ నుంచి 30సెప్టెంబర్ 2019 వరకు ఓటర్లు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి పరిశీలన, చనిపోయిన వారి పేర్ల తొలగింపు పరిశీలనలు చేసేందుకు షెడ్యూలు ప్రకటించడం జరిగిందన్నారు. ఒక కుటుంబంలోని ఓటర్లు అందరూ ఒకే పోలీంగ్‌స్టేషన్, ఒకే సెక్షన్‌లో వచ్చే విధంగా చూడాలన్నారు. పోలింగ్ స్టేషన్లలో సెక్షన్‌లు ఉంటాయని చిరునామా అన్నింటికి ఒకటే ఉంటుందని అన్నారు. ముందుగా మండలంలోని ఒక గ్రామాన్ని గుర్తించి అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని పూర్తి చేయాలన్నారు. తర్వాత మిగతా గ్రామాలు చేస్తే సులువు అవుతుందని అభిప్రాపడ్డారు. దివ్యాంగులు, కొత్త ఓటర్లను ఓటర్ జాబితాలో చేర్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అంతకు ముందు గ్రామాల్లో పనిచేస్తున్న బూత్ లెవల్ అధికారులు సరిగ్గా పని చేయని వారిని మార్చి కొత్త బూత్‌లెవల్ అధికారుల ప్రతిపాదనలు ఈ నెల 13వ తేదీ సాయంత్రం లోగా తనకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో రాములు, తాసిల్దార్‌లు తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles