నిర్వాసిత గ్రామాల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు

Sat,August 10, 2019 03:04 AM

గద్వాల, నమస్తే తెలంగాణ : జూరాల, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ముంపునకు గురైన నిర్వాసిత గ్రామాలకు పరిహారంతో పాటు ప్రజలు నివసించడానికి అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు కలెక్టర్ శశాంక పీజేపీ, నెట్టెంపాడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి ముంపునకు గురైన నిర్వాసిత గ్రామ పెద్దలతో పాటు ఇరిగేషన్, విద్యుత్, దేవాదాయ, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉప్పేరు నిర్వాసితులకు 120 ఎకరాలు ప్లాట్ల లేఅవుట్ చేసి కేటాయించగా మొదటి విడతలో 333 ఇండ్లు ప్రభుత్వం కట్టించి ఇవ్వగా, రెండో విడతలో కొంతమందికి కట్టిన డబ్బులు రాగా మరికొందరికి రావాల్సి ఉందన్నారు. మూడో విడత వారికి ఇంతవరకు ప్లాట్లు సైతం కేటాయించలేదని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వారం రోజుల్లో ఇవ్వాల్సిందిగా ఆర్డీవో రాములు, తాసిల్దార్ కృష్ణను కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్‌కు సంబంధించి గ్రామంలో దీన్ దయాళ్ యోజన కింద దరఖాస్తు చేసుకున్న వారికి విద్యుత్ మీటర్లతోపాటు వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సిందిగా విద్యుత్ శాఖ డీఈని ఆదేశించారు.

ముంపునకు గురైన గ్రామాల్లో దేవాలయాల నిర్మాణాలకు రూ.1.17 కోట్లు అవసరం అవుతాయని ఆ నిధులను ఇరిగేషన్ ద్వారా మంజూరు చేయాల్సి ఉందన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ముంపునకు గురైన ఆలూరు, ర్యాలంపాడ్, చాగదోణ, చిన్ననిపల్లి గ్రామాలపై చర్చిస్తూ గట్టు నుంచి ఆలూరు గ్రామానికి ఆర్ అండ్ బీ రోడ్డు, పంట పొలాల్లోకి దారులు మినహా దాదాపు అన్ని సౌకర్యాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. ముంపునకు గురైన గ్రామాలల్లో పెండింగ్‌లో ఉన్న పరిహారంతోపాటు నిర్వాసితుల గ్రామాలలో కనీస సౌకర్యాలను కల్పించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ముం

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles