చిగురిస్తున్న ఆశలు

Fri,August 9, 2019 02:26 AM

-ర్యాలంపాడుకు 1.35 టీఎంసీల చేరిక
-మరో రెండు రోజుల్లో చెరువులకు నీళ్లు
-రైతులతో కలిసి కాలువలు సిద్ధం చేస్తున్న అధికారులు
-ప్యాకేజీ 105,106 కాలువల్లో చెట్ల తొలగింపు
-25 డిస్ట్రిబ్యూటరీల ఏర్పాటు
-నిండనున్న 103 గొలుసుకట్టు చెరువులు
-లక్షా 38వేల ఎకరాల ఆయకట్టుకు జీవం

జోగుళాంబగద్వాల ప్రతినిధి/నమస్తేతెలంగాణ : నెట్టెంపాడు పరిధిలోని ప్రతి ఎకరాలకు నీటిని అందించేందుకు ప్ర భుత్వం అన్ని ఏర్పాట్లను చేపట్టింది. మరో రెండు రోజుల్లో ర్యాలంపాడు రిజ ర్వాయ ర్ నుంచి చెరువులకు నీటిని వి డుదల చేయనుండటంతో కాలువలను సిద్ధం చేస్తున్నారు. నీటి ప్రవాహానికి అ డ్డంకులు రాకుండా ఉండేందుకు కాలు వల్లో మొలిచిన జమ్మును పూర్తిగా తొలిగించే ప నిలో పడ్డారు. కాలువల ద్వారా నీటిని పొందే రైతులు కూడా స్వచ్ఛందంగా కా లువలు శుభ్రం చేయడంలో పాల్గొంటున్నారు. చివరి ఆయకట్టు వర కు నీటిని సమృద్ధిగా అందించేందుకు ముందస్తు చర్యలను చేపట్టారు. వీటితో పాటు రైతులు ఎక్కడ పడితే అక్కడ కా లువలకు రంద్రా లు పెట్టకుండా అవసరమైన ప్రతి చోట ప్రభు త్వం డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను నూతనంగా నిర్మిస్తుంది. ఈ కెనాళ్ల పూర్తి తరువాత అన్ని వాగు ల్లో చెక్‌డ్యాంలను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

కాలువలు శుభ్రం చేస్తున్న ప్రభుత్వం
జూరాలకు అనుకున్న స్థాయికంటే పెద్దమొత్తంలో వరద నీరు చేరడంతో ఇక జి ల్లాలో నీటి కొరత లేకుండాపోయింది. నెట్టెంపాడు ప్రాజెక్ట్ ద్వారా ర్యాలంపా డు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసిన నీటిని చివరి ఆయకట్టు వరకు అందించేందు కు ప్రభు త్వం తగిన ఏర్పాట్లను చేపట్టింది. ఇందు లో భాగంగా నే ప్యాకేజి 105, 106లోని కాలువల్లో అధికంగా మొలిచిన చెట్లను, పెరుకుపోయిన చెత్తచెదారాన్ని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. గట్టు, మల్దకల్ పరిధిలో ఉన్న కాలువల్లో దాదాపు 32కిలోమీటర్ల మే రా పెరిగిన చెట్లను స్థానిక రైతుల సహాయంతో అధికారులు తొలగించే పనిలోపడ్డారు.

నూతనంగా
25 డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు
కాలువల్లోని నీటితో తమ పొలాలను, ఊరి చెరువులను నింపుకోవాలనే ఉద్దే శం తో రైతులు కాలువలకు ఎక్కడపడితే అక్కడ రంద్రాలు ఏర్పాటు చేశారు. నిబంధలనకు విరుద్ధుంగా చేసిన ఈ పనులను అరికట్టి ప్రతి చెరువుకు నీరు పారేందుకు అధికారులు నూతన డిస్ట్రిబ్యూటరీలను ఏర్పాటు చేశారు. నెట్టెం పాడు పరిధిలోని అన్ని కాలువలకు మొత్తం 65 నూతన డిస్ట్రిబ్యూటరీలను ఏర్పాటు చేసేందుకు అధికారులు కార్యచరణ ప్రారంభించారు. కాలువల మరమ్మతుల కోసం ఏర్పాటు చేసిన నిధుల నుంచి వీటిని ఖర్చు చేస్తున్నారు. ఈ సీజన్‌లో మొదటి విడతలో ఇప్పటి వర కు ఒక్కో డిస్ట్రిబ్యూటరీకి రూ.9 లక్షలు ఖర్చుచేసి 25 డిస్ట్రిబ్యూటరీలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రతి గ్రామంలోని చెరువులకు నీటి స రఫరా చేయనున్నారు. డిస్ట్రిబ్యూటరీల పనులు మొత్తం పూర్తయిన తరువాత ప్రతి గ్రామంలోని వాగులకు 3కిలోమీటర్ల పరిధిలో చెక్ డ్యాంలను ఏర్పాటు చే యనున్నారు. నెట్టెంపాడు పరిధిలో దాదా పు 500 చెక్‌డ్యాంలను ప్రభు త్వం ఏర్పాటు చేయవచ్చు.

మరో రెండు
రోజుల్లో చెరువుల్లోకి నీరు
ర్యాలంపాడు రిజర్వాయర్‌కు రోజుకు 1800 క్యూసెక్కులు అంటే దాదాపుగా 0.15టీఎంసీల నీరు చేరుతుంది. 2టీఎంసీలకు ర్యాలంపాడు రిజర్వాయర్‌లో నీరు చేరిన వెంటనే కాలువల ద్వారా చెరువుల్లోకి విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరో రెండు రోజుల్లో కాలువలకు విడుదల చేసేందుకు నీరు స మృద్ధిగా చేరడంతో విడుదల చేయను న్నా రు. దీంతో నెట్టెంపాడు పరిధిలోని 103 గొలుసుకట్టు చెరువులకు నీరు చేరుకోవడంతో ఈ ఆయకట్టు కింద దాదాపు లక్షా 38వేల ఎకరాలకు సాగు నీరందనుంది.

కాలువలు సిద్ధమవుతున్నాయి
నెట్టెంపాడు పరిధిలోని కాలువలను ప్రభు త్వం రైతులతో కలిసి శుభ్రం చేస్తుంది. రైతులు స్వచ్ఛందంగా కాలువలు శుభ్రం చేసు కోవడంలో పాల్గొంటున్నారు. 30కిలో మీటర్లమేర చెట్లు, చెత్తచెదారం నిలిచి ఉంది. రెండు రోజుల్లో నిరంతరం శ్రమించిన కాలువల్లో నీరు సజావుగా పారేందుకు చర్యలు చేపట్టాం. నీటిని విని యోగించుకునే విషయంలో రైతులకు ఎలాంటి తగాదాలు రాకుండా అన్ని నూతనంగా డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను ఏర్పాటు చేశాం. ఈ కెనాల్ పూర్తయిన తరువాత కాలువల్లో చెక్‌డ్యాంలను ఏర్పాటు చేస్తాం.- బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles