ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ

Fri,August 9, 2019 02:23 AM

మిడ్జిల్: కాసులకు కక్కుర్తిపడి మిడ్జిల్ విద్యుత్ ఏఈ అడ్డం గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏఈ పర్వతాలు రైతు రాజేందర్‌రెడ్డి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో మెరుపు దాడులు చేశారు. దీంతో అధికారులు, సిబ్బంది ఉలిక్కిపడ్డా రు. వివరాలు ఇలా.. మండలంలోని కొత్తూర్ గ్రా మానికి చెందిన రైతు రాజేందర్‌రెడ్డి తన వ్యవసాయ పొలంలో ట్రాన్స్‌పార్మర్‌కోసం రెండునెలలుగా విద్యుత్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.

చివరికి విద్యుత్ ఏఈ పర్వతాలు రైతుతో పని కావాలంటే రూ.20వేలు డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని.. చివరకు రూ.12వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీం తో రైతు చేసేదిలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీ బీ అధికారులు పక్కా ప్రణాళికతో నిఘా వేసి ఏఈ పర్వతాలు రైతు నుంచి రూ.12వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం రెండు గంటలపాటు కార్యాల యంలో విచారణ చేపట్టారు. ఏసీబీ దాడుల విషయం మం డలంలో చర్చనీయాంశమైంది. కొందరు కార్యాలయం వద్ద రైతులు ట్రాన్స్‌పార్మర్ విషయంలో మమల్ని కూడా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారని, నగదు ఇవ్వకపోతే ఏదో కొర్రీ పెడతారనే భయంతో డబ్బులిచ్చి పని చేయించుకున్నామని కొందరు బాహటంగానే చెప్పు కున్నారు. అనంతరం శుక్రవారం ఏసీబీ కోర్టులో విచారణ ఉంటుందని ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ తెలిపారు. ఎక్కడైనా అధికారులు అవినీతికి పాల్పడితే టోల్‌ఫ్రీ 1064కి ఫిర్యాదు చేస్తే న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. దా డుల్లో సిబ్బంది లింగస్వామి, ప్రవీణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles