ఫిర్యాదులను పరిష్కరంచండి

Tue,July 23, 2019 01:16 AM

నారాయణపేట టౌన్ : ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరిం చాలని కలెక్టర్ వెంకట్రావు ఆయా శాఖల అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ వెంకట్రావు కాసేపు ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరిం చారు. అనంతరం డీఆర్‌వో రవికుమార్, డీఆర్‌డీవో రఘువీరారెడ్డిలు ఆయా మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయా మండలాలకు సంబంధించిన ఫిర్యాదులపై వీసీ ద్వారా తాసిల్దార్లను వివరణ కోరారు.
కబ్జా నుంచి భూమిని కాపాడాలి
ధన్వాడ మండలం మందిపల్లి గ్రా మ పరిధి సర్వే నెంబర్ 1లో గతంలో వాటర్ షెడ్ ద్వారా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి సర్వే నెంబర్ మొ త్తంలో హరితహారం కార్యక్రమంలో నాటిన చెట్లను కొంతమంది అక్రమం గా చదును చేస్తున్నారని, పనులను ఆపివేయాలని గ్రామస్తులు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్‌కు వినతిని అం దించారు. గ్రామపంచాయతీ డం పింగ్ యార్డును తొలగించి ప్రభుత్వ భూమి ని కొంతమంది చదును చేసి ఆక్రమించుకున్నారని వినతిలో పేర్కొన్నారు. అలాగే కోటకొండను మండల కేంద్రం గా ఏర్పాటు చేయాలని ఎంపీటీసీ సునీ త కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించారు. అదేవిధంగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కొంతసేపు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇ చ్చిన హమీలను వెంటనే నెరవేర్చాలని, రైతులకు పెండింగ్‌లో ఉన్న పంటపాసు పుస్తకాలను అందించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మందిపల్లి గ్రామ ఎంపీటీసీ ప్రమీలమ్మ, సురేందర్‌రెడ్డి, నర్సింహులు, వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు.
ప్రజావాణికి 131 ఫిర్యాదులు
సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 131ఫిర్యాదులు రా వడం జరిగిందని కలెక్టరేట్ కార్యాలయ ఏవో బాలాజీ సపారే తెలిపారు. వీటిలో 87 ఫిర్యాదులు భూసమస్యలపై రాగా 18 ఫిర్యాదులు పాసుపుస్తకాల అంశం పై మరో 26 ఫిర్యాదులు ఇతర శాఖలకు సంబంధించినవి రావడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రజావాణిలో ఆయా శాఖల అధికారులు రవీందర్, డా.సౌభాగ్యలక్ష్మి, రాజ్‌కుమార్, జైపాల్‌రెడ్డి, యాదయ్యగౌడ్, దేవసేన, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles