అందరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Mon,July 22, 2019 01:37 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ/హన్వాడ : పే దల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం శ్ర మిస్తుందని, మీ అందర్ని కన్నకొడుకులా చూసుకుంటామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నా రు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మం దిరంలో, హన్వాడ మండల కేంద్రంలో ఆసరా లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తాను పాల్గొంటున్నప్పటికీ.. పాలమూరును చూసి మి మ్మల్ని పలకరించకపోతే మనస్సు ప్రశాంతంగా ఉండదని మంత్రి తెలిపారు. ఎక్కడికి వెళ్లినా మహబూబ్‌నగర్ అభివృద్ధిపైనే తన ధ్యాస ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు బ్రహ్మర థం పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ వృ ద్ధురాలిని చూసినా వారి మోములో ఆనందం ఉట్టి ప డుతుందన్నారు. నా కొడుకు అన్నం పెడుతాలేడు..నా కోడలు రోజు తిడుతుంది.. నన్ను పట్టించుకోవడంలేదని వృద్ధులు భయపడే పని లేదని, మరింత ధైర్యంగా జీవించేందుకు ఆసరా పింఛన్లు ఉపయోపడుతాయన్నా రు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తక్షణమే ప రిష్కరించేందుకు టీఆర్‌ఎస్ సైన్యం సిద్ధంగా ఉంటుందన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చ ర్యలు తీసుకుంటామన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. ని యోజకవర్గంలోని అన్ని చెరువులను నీటితో నింపి ఆ యకట్టు పొలాలను సాగులోకి తెస్తామన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
హన్వాడ మండల కేంద్రంలో 20మంది కల్యాణల క్ష్మి లబ్ధిదారులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెక్కులు పం పిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లో డబ్బులు అందేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయా కా ర్యక్రమాల్లో జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణలత, స్పెషల్ కలెక్టర్ క్రాంతి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కాడం ఆంజనేయులు, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ఎంపీపీ సుధాశ్రీ, జెడ్పీ సీఈవో యాదయ్య, కోఆప్షన్ సభ్యుడు అల్లొద్దీన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, హన్వాడ జెడ్పీటీసీ విజయనిర్మల, ఎంపీపీ బాల్‌రాజ్, వైస్ ఎంపీపీ లక్ష్మి, ఎం పీడీవో నటరాజ్, సర్పంచ్ రేవతి, ఎంపీటీసీలు సత్య మ్మ, కల్పన, టీఆర్‌ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మ య్య, కృష్ణయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles