జోగుళాంబ ఆలయంలో చండీ హోమం

Sat,July 20, 2019 06:05 AM

అలంపూర్, నమస్తే తెలంగాణ : ఐదవ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న పట్టణంలోని జోగుళాంబ ఆలయంలో ప్రతి శుక్రవారం చంఢీహోమంతో పాటు సంధ్యా వేళ రథోత్సవం ఘనంగా నిర్వహించారు. జోగుళాంబ ఆలయంలో శుక్రవారాన్ని పురష్కరించుకొని అమ్మ వారికి అర్చకులు వారోత్సవ పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మ వారిని బంగారు అభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. త్రిశతి, ఖడ్గమాల, కుంకుమార్చనలు మొదలగు పూజలు నిర్వహించారు. అమ్మవారికి కుమారి సువాసిని పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజే శారు. మరో వైపు ఆలయంలోని యాగశాలలో ఉదయం సామూహిక చండీహోమాలు నిర్వహించారు. సాయంత్రం సంధ్యావేళ జోగుళాంబ ఆలయంలో రథోత్సవం శోభాయమానంగా నిర్వహించారు. జోగుళాంబ దేవి రథాన్ని సర్వాంగ సుందరంగా అలంక రించారు. గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆలయాలను విజయవాడ సీనియర్ సివిల్ జడ్జి బాలాజీ దర్శించుకున్నారు. వారి వెంట స్థానిక కోర్టు జూనియర్ అసిస్టెంట్ చినరాజు ఉన్నారు. మరో సందర్భంలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో గీత తదితరులు ఆలయాలను దర్శించుకున్నారు. వారి వెంట దేవాదాయ శాఖ ఏసీ వెంకటాచారి ఉన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles