పాలమూరులో పొలిటికల్ హీట్

Fri,July 19, 2019 03:40 AM

మహబూబ్‌నగర్, మున్సిపాలిటీ : మున్సిపల్ ఎన్నికల హడావుడిలో కొత్తకోణం వెలుగుచూసింది. మున్సిపల్ వార్డుల పునర్విభజన సక్రమంగా జరుగకపోవడంతోపాటు ఒకే ఇంటి నెంబర్‌పై అధిక మంది ఓటర్లు ఉన్నాయని పట్టణానికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.దీంతో మున్సిపల్ అధికారులు సైతం హైకోర్టు చుట్టుప్రదక్షిణలు చేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా తాము వార్డు ల విభజన చేసినట్టు మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు.

మున్సిపల్ చట్టం ఏం చెబుతోంది..
మున్సిపల్ చట్టం వార్డుల విభజన చేయు విధానం గుర్చి అసలు ఏం చెబుతోంది ? అధికారులు ఏం చేశారు ? అనేది ప్రస్తుతం పాలమూరులో చర్చనీయాంశమైంది. 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటూ ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన విషయం విదితమే. జీవో నెంబర్ 193 ప్రకారం మున్పిపల్ వార్డుల పునర్విభజ న చేయాల్సి ఉన్నది. ముందుగా తూర్పు నుంచి పడమర వరకు ఓటరు జాబితాలను పరిగణనలోకి తీసుకొని వార్డుల విభజన చేపట్టారు. 49 వార్డులకు సరిపడా ఓటర్లు ఉండే విధంగా విభజించి అన్ని వార్డులకు సమానంగా ఓట్లు ఉండేలా విభజన ప్రక్రియ కొనసాగింది.

ఓటర్ల జాబిత సవరణ బీఎల్‌వోలదే బాధ్యత..
ఓటరు లిస్టుపై ప్రతి ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి అనే విషయాలు క్షుణంగా బీఎల్‌వోలకు తెలుస్తుంది. ఓటరు లిస్టుపై పూర్తి అవగాహన ఆయా వార్డుల్లో ఇంటింటి సర్వే నిర్వహించిన బీఎల్‌వోలకు పూర్తి అవగాహన ఉంటుంది. ఓటు హక్కు కల్పించిన తరువాత జాబితాను పరిగణలోకి తీసుకుని వార్డుల విభజన ప్రక్రియ చేపట్టినట్టు మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. ఒకే ఇంటిపై అధిక ఓట్లు ఉండకూడదు అనే నిబంధనలు ఎక్కడా లేదని మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ఒకే ఇంటి నెంబర్‌పై అధిక ఓట్లు ఉంటే దానికి తామెలా బాధ్యత వహించాలంటూ మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ఇదే ఓటరు లిస్టు ప్రకారం ఇప్పటికే పలు మార్లు ఎన్నికల జరిగిన విషయం విదితమే. ఓటర్ లిస్టుల్లో పేర్లు తప్పుగా ఉన్నా, అభ్యంతరాలు ఉన్న సరిచేసుకోవాలని బీఎల్‌వోలు, జిల్లా ఉన్నత అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేసి ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఓటరు లిస్టులో ఎవరు ఎక్కడ ఉన్నారు ? ఉంటే ఎలాంటి అభ్యంతరాలు గల వారు ఉన్నారు ? అనే అంశాలను పరిష్కరించేందుకు తాము సిద్ధమని అధికారులు తెలిపారు.
ఉదాహరణకు...మున్సిపాల్టీ పరిధిలో కేవలం పదివేల మంది ఓటర్లతో పదివార్డులున్నాయనుకుంటే.. ఓటరు లిస్టు ఆధారంగా పదివార్డులకు వెయ్యేసి మందికి ఒక వార్డు చొప్పున విభజిస్తారు. ఈ వార్డుల పునర్విభజన క్రమంలో తూర్పు పడమరతోపాటు ప్రధాన రోడ్లను దాటకుండా హద్దులు నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలో ముందుగా ఉన్న వార్డుకు నిబంధనల మేరకు ఉన్న పది వార్డులలో ముందు వార్డు కోట వెయ్యి ఓట్లు పూర్తి అయ్యాకే రెండవ వార్డును పరిగణలోకి తీసుకుంటారు. ఈ క్రమంలో ఓట్లు ఇతర వార్డులకు సంబంధించి ఎవరైన ఈ వార్డులలో ఉంటే.. వారు ఆధారాలతో అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారి ఓటును పాత వార్డునుంచి తొలగించే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనలు పాటిస్తూ మున్సిపల్ వార్డుల విభజన చేపట్టినట్టు అధికారులు చెప్తున్నారు.

పరుగులు పెడుతున్న మున్సిపల్ అధికారులు..
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా హైకోర్టు మున్సిపల్ అధికారుల నిబంధనల మేరకు ముందుకు సాగాలని స్టే విధిస్తు గురువారం వెలవడనున్నా ఉత్తర్వులందే వరకు నిరీక్షించాలని బుధవారం హైకోర్టు చెప్పిన విషయం విదితమే. దీంతో మున్సిపల్ అధికారులు గురువారం తగిన ఆధారాలతో హైకోర్టుకు తరలివెళ్లారు.

పిటిషనర్ లేవనెత్తిన అంశాలన్నీ షెడ్యూల్‌లోపు సరి చేయాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ ఎన్నికల పక్రియలో లోపాలున్నాయని పిటిషనర్ పేర్కొన్న అంశాలను సరి చేయాలని హైకోర్టు మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తర్వులను విడుదల చేసింది. ప్రస్తుతం మున్సిపల్ అధికారులు చేపట్టిన ఎన్నికల పక్రియ ప్రకారం ఎన్నికలకు వెళ్లవద్దని, ఎన్నికల షెడ్యూల్‌లోగా ఈ అంశాలన్నింటినీ సరి చేయాలని అవకాశం ఇచ్చింది. అయితే, దీనిపై న్యాయ సలహాలు తీసుకొని ఏ విధంగా చేయాలో పరిశీలిస్తామని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై న్యాయసలహాలు తీసుకొని దాని ప్రకారం పని చేస్తామని వెల్లడించారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles